పీఎం శ్రీ వెల్దుర్తి విద్యార్థులకు కంటి పరీక్షలు
42 మంది విద్యార్థుల గుర్తింపు..
వెల్దుర్తి, నవంబర్ 16, (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఈరోజు పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(PM Shri Zilla Parishad High School) వెల్దుర్తి విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంగీత తూప్రాన్, జి. వీరకుమార్, అప్తాలమిక్ పాల్గొన్నారు.
ఈ కంటి పరీక్షల్లో మొత్తం 42 మంది విద్యార్థులను గుర్తించడం జరిగింది. వీరికి త్వరలో కళ్లద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. గతంలో వైద్య పరీక్షల ద్వారా గుర్తించిన 35 మంది విద్యార్థులకు కళ్ళ అద్దాలు ఇవ్వడం జరిగింది. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, అవసరమైన వైద్య సేవలు అందించేందుకు వైద్య బృందం సహకరించింది. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. సాంబయ్య పేర్కొన్నారు.