రూ.1.50 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం

03-11-2026 | 08:11pm

పనులను ప్రారంభించిన మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్

మేడిపల్లి, నవంబర్ 3 (విజయక్రాంతి): బోడుప్పల్ సర్కిల్ పరిధిలో మొత్తం రూ.1.50 కోట్ల నిధులతో  బోడుప్పల్ డివిజన్ రాజాలింగం కాలనీ ఫేజ్-2లో రూ.90 లక్షలతో, చెంగిచెర్ల డివిజన్ శివదుర్గ కాలనీలో రూ.60 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను మంగళవారం బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్(Former Mayor Ajay Yadav) ప్రారంభించారు. ఈ సందర్భంగా అజయ్ యాదవ్ మాట్లాడుతూ, ప్రజల అవసరాలను గుర్తించి కాలనీల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన రహదారులు, మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మాజీ డివిజన్ అధ్యక్షుడు పొగుల నర్సింహారెడ్డి, బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, చెంగిచెర్ల డివిజన్ అధ్యక్షుడు పొగుల దిలీప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కుర్రి మహేష్, అసర్ల బీరప్ప, వైస్ ప్రెసిడెంట్ రసాల కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్, కొత్త చందర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు బ్రహ్మన్న గౌడ్, కాంగ్రెస్ నాయకులు కుర్రి శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు