డంపింగ్‌ యార్డు అంశం బీజేపీ రాజకీయ మైలేజ్‌ కోసమే

04-11-2026 | 10:54pm

ఎదులాబాద్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సామల అమరేందర్‌

ఘట్ కేసర్, నవంబర్ 4 (విజయక్రాంతి): జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు(Jawaharnagar dumping yard) అంశంపై బీజేపీ నాయకులు రాజకీయ మైలేజ్‌ కోసమే ప్రచారం చేస్తున్నారని ఏదులాబాద్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సామల అమరేందర్‌ ఆరోపించారు. బుధవారం ఎదులాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డంపింగ్‌ యార్డు తరలింపు విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ దృష్టికి సమస్య తీవ్రతను తీసుకెళ్లారని గుర్తుచేశారు.

ఇటీవల నాగారంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారని, ఇబ్రహీంపట్నం, బండరావిరాల, దుబ్బాక, కరీంనగర్‌ పరిసర ప్రాంతాల్లో డంపింగ్‌ యార్డు ఏర్పాటుకు స్థలాలను పరిశీలించారని తెలిపారు. జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు వ్యర్థ రసాయనాలు ఎదులాబాద్‌ లక్ష్మీనారాయణ చెరువులో కలవకుండా చర్యలు తీసుకోవాలని వజ్రేష్‌ యాదవ్‌ హైడ్రా కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. రసాయన వ్యర్థాలు చెరువులో కలవకుండా ప్రత్యేక కాలువ నిర్మించి మూసీలోకి మళ్లించేలా ప్రణాళికలు సిద్ధం చేసి, అంచనా బడ్జెట్‌ రూపొందించినట్లు అమరేందర్‌ వివరించారు. డంపింగ్‌ యార్డు తరలింపునకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు.

మరిన్ని వార్తలు