పూలే జీవితం... యావత్ ప్రపంచానికి ఆదర్శం
విద్య అన్నింటికీ మూలం.. విద్యాభివృద్ధియే జ్ఞానాభివృద్ధి
జవహర్ నగర్ బిసి ఐక్యవేదిక వెల్లడి.
జవహర్ నగర్ నవంబర్ 28 (విజయక్రాంతి): మహాత్మ జ్యోతిరావు పూలే(Mahatma Jyotirao Phule) జీవితం ప్రపంచానికే ఆదర్శమని ...విద్య అన్ని మార్గాలకు మూలమని విద్యాభివృద్ధియే జ్ఞానాభివృద్ధి అని జవహర్ నగర్ బిసి ఐక్యవేదిక సభ్యులు(Members of the Jawahar Nagar BC Unity Forum) పేర్కొన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(Malkajgiri Municipal Corporation) పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ డివిజన్లో మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి వేడుకలను జవహర్ నగర్ బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం రోజున ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, జవహర్ నగర్ తొలి మేయర్ మేకల కావ్య చంద్రపురి కాలనీ డివిజన్ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ తదితరులుపాల్గొని మహాత్మునికి పూలమాలలతో వందనం సమర్పించి అనంతరం మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం అందరికీ ఆదర్శప్రాయమని విద్య అన్నింటికీ మూలమని విద్య ప్రపంచానికే మార్గదర్శి అన్నారు. జవహర్ నగర్ లో అత్యధిక జనాభా గల బీసీలకు వచ్చే ఎన్నికల్లో మూడు డివిజన్లుగా చేసి అవి బీసీలకే కేటాయించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిసి ఐక్యవేదిక నాయకులు అశోక్ యాదవ్ కృష్ణ యాదవ్ పాక దేవేందర్ మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ జవహర్ నగర్ డివిజన్ 3 అధ్యక్షులు శాంతి కోటేష్ గౌడ్ చంద్రపూర్ కాలనీ డివిజన్ టు అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ బిఆర్ఎస్ ప్రెసిడెంట్ కొండల ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీ ఓబిసి అధ్యక్షులు పసుపులేటి వీరభాస్కరరావు మాజీ కార్పొరేటర్లు గొడుగు వేణు జమాల్పూర్ నవీన్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సతీష్ గౌడ్, సామాజిక సేవకులు బూడిద వెంకటేష్, డిఎస్ఎస్ ఎర్ర గుడ్ల వెంకటేశ్వర్లు, సోమాచారి, వల్లికంటి శంకర్ రాజు యాదవ్ బుజ్జి బండ కింది ప్రసాద్ బీసీ ఐక్య వేదిక కమిటీ సురేందర్ నరసింహులు అశోక్ యాదవ్, రాజు యాదవ్ దుర్గేష్ రామబ్రహ్మం వీరాచారి యాదగిరి నర్ర మహేష్ కృష్ణ యాదవ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.