చంద్రపురి కాలనీ బీజేవైఎం డివిజన్ అధ్యక్షుడిగా రాకేష్ నియామకం
డివిజన్లో యువ మోర్చాను మరింత బలోపేతం చేస్తా: రాకేష్..
జవహర్ నగర్, నవంబర్ 10 (విజయక్రాంతి): భారతీయ జనతా యువమోర్చా(BJYM) చంద్రపురి కాలనీ(Chandrapuri Colony) డివిజన్ అధ్యక్షుడుగా ఆర్. రాకేష్ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు గణేష్ బిజెపి మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ ఆమోదంతో బీజేవైఎం మేడ్చల్ మల్కాజిగిరి రూరల్ జిల్లా అధ్యక్షులు రాగం అర్జున్ ఈ నియామకాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రాగం అర్జున్ మాట్లాడుతూ రాకేష్ పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నారని ఆయన నాయకత్వంలో చంద్రపురి కాలనీ డివిజన్ లో యువమోర్చా మరింత బలోపితం అవుతుందన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు యువతను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడంలో రాకేష్ కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు రాకేష్ మాట్లాడుతూ పార్టీ నాపై ఉంచిన బాధ్యతను మరింత సమర్ధవంతంగా నిర్వహిస్తానని డివిజన్లో యువమోర్చాను మరింత బలోపితం చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా చింతలపూడి కాలనీ డివిజన్ అధ్యక్షుడు జోగారావు బిజెపి పార్టీ సీనియర్ నాయకులు సంతోష్ గుప్తా బీజేవైఎం నాయకులు కార్యకర్తలు రాకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు.