రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఘనంగా వార్షిక క్రీడ మహోత్సవం
ఘట్ కేసర్, నవంబర్ 15 (విజయక్రాంతి): రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్(Rotor Dam International School) ఆధ్వర్యంలో ప్లేఫినిటి 2026-27 ఆదివారం ఎంతో ఉత్సాహభరితంగా జరిగింది. ఈ క్రీడా మహెూత్సవానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ మహిళా క్రికెటర్ సునీత ఆనంద్, ప్రొఫెషనల్ క్రికెటర్ అక్షత్ రెడ్డి విచ్చేసి విద్యార్థులను ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ ఎం. విజయసింహారెడ్డి, డైరెక్టర్ జి. శ్వేతారెడ్డి, ప్రిన్సిపాల్ కె. రూపారెడ్డి పాల్గొని క్రీడా మహెూత్సవాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో క్రీడల ప్రాముఖ్యతను వివరించారు. క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సమయపాలన, జట్టుస్పూర్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.
ప్రీ-ప్రైమరీ నుంచి 7వ తరగతి వరకు విద్యార్థులు వివిధ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థుల అద్భుతమైన ప్రదర్శనలు, క్రీడా నైపుణ్యాలు, ఉత్సాహం అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి వారిని అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పాఠశాల యాజమాన్యం వెల్లడించింది. ఈ క్రీడా మహోత్సవం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ, ఐక్యత, క్రీడాస్పూర్తికి ప్రతీకగా నిలిచింది.