నేను ఆ టైపు అస్సలు కాదు!
బాలీవుడ్ హాట్ బ్యూటీ(Bollywood hot beauty), టాలీవుడ్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ ఫేమ్ దిశా పటానీ(Disha Patani) నిరంతరం వార్తల్లో నిలిచే కథానాయిక. వెండితెరపైనే కాకుండా, సోషల్ మీడియాలోనూ(Social Media) తనదైన గ్లామరస్ ఫోటోషూట్లు, ఫిట్నెస్ వీడియోలతో ఎప్పుడూ రచ్చ చేస్తుంటుందీ భామ. అయితే, ఈ తరహా సోషల్ మీడియా ఇమేజ్(Social media image) వల్ల ప్రేక్షకులు తనపై ఒక నిర్దిష్టమైన ముద్ర వేశారని ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో(Interview) పేర్కొంది. ఈ సంద ర్భంగా దిశా పటానీ మాట్లాడుతూ.. “నేను నిరంతరం గ్లామరస్‌గా, బోల్డ్‌గా కనిపిస్తూ ఉండేసరికి, జనాలు నన్ను ఒక రకమైన ‘పార్టీ టైప్’ అమ్మాయిగా అనుకుంటున్నారు.
నిత్యం పార్టీలకు తిరగడం, ఎంజాయ్ చేయడం నా అలవాటు అనుకుంటారు. కానీ నిజానికి నేను ఆ టైపు అస్సలు కాదు. నేను చాలా సాధారణ జీవితం గడపడానికి ఇష్టపడతాను. నేను వ్యక్తిగతంగా చాలా సిగ్గుపడే రకమని (ఇంట్రోవర్ట్), ఖాళీ సమయం దొరికితే పార్టీల వైపు వెళ్లకుండా ప్రశాంతంగా ఇంట్లోనే గడపడానికి ప్రాధాన్యత ఇస్తాను” అని తెలిపింది. తాను వ్యక్తిగత జీవితంలో ఆల్కహాల్ వంటి అలవాట్లకు దూరంగా ఉంటానని గతంలోనూ దిశ పటానీ ప్రస్తావించింది.
‘పార్టీలకు వెళ్లినప్పుడు అక్కడ అందరూ మద్యం తాగి, తమ నియంత్రణ కోల్పోయి వింతగా ప్రవర్తిస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే తెలియని వ్యక్తులు ఉండే పార్టీలకు నేను దూరంగా ఉంటా. కేవలం నా షూటింగ్ టీమ్ లేదా సహోద్యోగులతో మాత్రమే పరిమితంగా గడుపుతాన’ని తన మనసులోని మాటను పంచుకుంది దిశా పటానీ.
తాజాగా ఇంటర్వ్యూలో దిశా పటానీ తన గురించి ఇంకా చెప్తూ.. సినిమాల్లో ఎంత గ్లామరస్‌గా కనిపించినా, నిజ జీవితానికి వచ్చేసరికి బాస్కెట్‌బాల్ షార్ట్స్, నార్మల్ టీ-షర్టులు వేసుకుని సాధారణంగా ఉండటానికే ఇష్టపడతానని తేల్చిచెప్పింది. సోషల్ మీడియాలో కనిపించే స్క్రీన్ ఇమేజ్ను చూసి సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను అంచనా వేయలేమని దిశా పటానీ చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి నిరూపించాయి.