తరుణ్ భాస్కర్ వాళ్లకు రాసిన లవ్ లెటర్.. ఈఎన్‌ఈ రిపీట్!

04-11-2026 | 05:10am

‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘ఈఎన్‌ఈ రిపీట్(ENE Repeat)’ నవంబర్ 19న విడు దల కానుంది. తరుణ్ భాస్కర్(Tarun Bhascker) ధాస్యం రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్(Vishwak Sen), అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకు మాను, శ్రీనాథ్ మాగంటి మరో సారి కలిసి నటిస్తు న్నారు. ఎస్ ఒరిజినల్స్, రూట్నోడ్ సినిమా బ్యాన ర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. “చాలా గర్వం గా వరల్డ్ వైడ్ రిలీజ్ అని చెప్పుకునే చిత్రమిది. ప్రేక్షకులందరూ నవ్వుతారు, ఆనందంతో ఏడుస్తారు” అన్నారు.  డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. “ప్రేక్షకుల అంచనాల గురించే నాకు భయం ఉండేది. పార్ట్‌౨ ఎప్పుడు అని అడిగేవారు. అందరికీ ప్రేమను తిరిగి ఇవ్వడానికి వచ్చాను. చాలా మంచి పాజిటివ్ ఎనర్జీతో చేసిన సినిమా ఇది. ఆ పాజిటివ్ ఎనర్జీ అందరికీ స్ప్రెడ్ అవుతుంది.

అందరూ ఫ్యామిలీతో కలిసి థియేటర్లకు రండి. చాలా ఎంజాయ్ చేస్తారు” అని తెలిపారు. నిర్మాత సృజన మాట్లాడుతూ.. “ఈసారి ప్రేక్షకులు ఫ్రెండ్స్ అందరితో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత పేరెంట్స్‌ను కూడా థియేటర్లకు తీసుకొస్తారు. అది నా గ్యారెంటీ. ఇది తరుణ్ భాస్కర్.. సినిమాకు, ఫ్రెండ్‌షిప్‌కు రాసిన ఒక లవ్ లెటర్‌” అన్నారు. ఈ ఈవెంట్‌లో శ్రీనాథ్ మాగంటి, అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను, అనిషా, శివాత్మిక కూడా మాట్లాడారు. సినిమా యూనిట్ అందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు