మిస్టరీ, మ్యాడ్‌నెస్, నవ్వులు కలిపేస్తే సీన్
హీరో సూర్య(Surya), మలయాళ బ్లాక్‌బస్టర్ ‘ఆవేశం’ ఫేమ్ దర్శకుడు జిత్తు మాధవన్‌తో(Jittu Madhavan) కలసి యాక్షన్-కామెడీ ఎంటర్ టైనర్ ‘సీన్(Scene)’ చేస్తున్నారు. ఇందులో నజ్రియా నజీమ్(Nazriya Nazim) హీరోయిన్‌గా నటిస్తుం డగా, నస్లేన్, ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అగరం స్టూడియోస్, 2డీ ఎంటర్‌టైన్ మెంట్ బ్యానర్లపై జ్యోతిక, సూర్య(Jyothika, Suriya) నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 6న థియేటర్లలో విడుదల కానుందీ చిత్రం. దీన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎన్వీఆర్ సినిమా ద్వారా రిలీజ్ చేయనుంది.
ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో సూర్య మాట్లాడుతూ.. “మేమందరం కలిసి ఒక బ్యూటిఫుల్ సినిమాను అందిస్తున్నాం. ఇందులో మర్డర్ మిస్టరీ, మ్యాడ్‌నెస్, నవ్వులు.. అన్నీ ఉన్నాయి. ఇది చాలా స్పెషల్ ఫిల్మ్. ఇందులో ఒక డైలాగ్ ఉంది. అది నిజంగా మీ జీవితంలో కూడా ఉపయోగపడుతుంది. మనపై మనం నమ్మకం ఉంచి ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చు. ‘సీన్’ చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కూడా. ఈ సినిమాతో దీపావళిని సెలబ్రేట్ చేసుకుందాం” అన్నారు.
హీరోయిన్ నజ్రియా నజీమ్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సులు చేశాను. నేను ఇందులో నటించిన మాయ క్యారెక్టర్ చాలా యూనిక్‌గా ఉంటుంది. నవంబర్ 6న అందరూ థియేటర్లలో ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్నా” అని తెలిపింది. ‘ఈ దీపావళికి అందరూ ఎంజాయ్ చేసే సినిమా ఇది’ అని నిర్మాత జయశ్రీ దామోదరన్ చెప్పారు.
నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. “సూర్య కెరీర్‌లో ఇది చాలా కొత్త సినిమా అవుతుంది. సూర్య అగరం ఫౌండేషన్ ద్వారా చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన సేవలను తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా విస్తరిస్తే మేమందరం ఎంతో సంతోషిస్తాం” అన్నారు. డైరెక్టర్ వెంకీ అట్లూరి, లిరిక్ రైటర్ రాకేందు మౌళి తదితర చిత్రబృందం కూడా ఈ వేడుకలో మాట్లాడారు.