కొత్తగా 5 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటు

28-11-2026 | 07:50pm

అన్నదాతలకు అందుబాటులోకి మరింత మెరుగైన సేవలు 

తాత్కాలిక షెడ్యూలు విడుదల 

జిల్లా సహకార అధికారి బి రామ్మోహన్ 

ములుగు, నవంబర్ 28 (విజయక్రాంతి) : జిల్లాలో మరో ఐదు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(Primary Agricultural Cooperative Societies) ఏర్పాటుకు తత్కాలిక ఉత్తర్వులు విడుదలయ్యాయి. జిల్లాలో ములుగు(Mulugu) పరిధిలో కాసిందేవిపేట, మల్లంపల్లి గ్రామాల్లో, తాడ్వాయి పరిధిలో కాటాపూర్, ఏటూరు నాగారం(Eturnagaram) పరిధిలో కన్నాయిగూడెం మంగపేట మండల పరిధిలో రాజుపేట గ్రామాల్లో మొత్తం ఐదు నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(Primary Agricultural Cooperative Societies) ఏర్పాటుకు తాత్కాలిక షెడ్యూల్ విడుదలైంది.

నూతన ఆకార సంఘాల ఏర్పాటుతో రైతులకు(Farmers) మరింత మెరుగైన సేవలు అందే అవకాశం ఉంది. నూతన వ్యవసాయ సంఘాల ఏర్పాటుకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 18 వరకు అభ్యంతరాల స్వీకరిస్తామని ఈ సందర్భంగా సహకార సంఘం జిల్లా అధికారి బి రామ్మోహన్ తెలిపారు.

మరిన్ని వార్తలు