ఉపాధి కోసం వెళ్లి అనంతలోకాలకు

05-11-2026 | 08:18pm

- సౌదీలో వెంకటాపూర్ వాసి మృతి

వెంకటాపూర్,(విజయక్రాంతి): బతుకుదెరువు కోసం సౌదీ అరేబియా(Saudi Arabia)కు వెళ్లిన ములుగు జిల్లా(Mulugu district) వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేట గ్రామానికి చెందిన కురిమిళ్ల రాజయ్య(48) అనూహ్యంగా మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎనిమిది నెలల క్రితం ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాలోని హయిల్ ప్రాంతానికి వెళ్లిన రఘు అక్కడ జీవనం కొనసాగిస్తున్నాడు.

ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీన అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రఘు మృతివార్తతో స్వగ్రామమైన లక్ష్మీదేవిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య అనిత, కుమార్తె స్నేహిత, కుమారుడు భువనేశ్వర్ ఉన్నారు. సౌదీ నుంచి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి మరో మూడు రోజులు పట్టే అవకాశం ఉండటంతో కుటుంబ సభ్యులు మృతదేహం కోసం ఎదురుచూస్తూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మరిన్ని వార్తలు