పేకాట శిబిరంపై పోలీసుల దాడులు..
ములుగు, నవంబర్ 10 (విజయక్రాంతి): అక్రమ సంపాదన కోసం లాడ్జిలో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్న సమాచారం తెలుసుకున్న పోలీసులు(Police) మంగళవారం ముక్కుమ్మడిగా దాడి చేసి పలువురు జూదరులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలో సవేరా లాడ్జి(Savera Lodge) నిర్వహిస్తున్న నిర్వాకుడు తిరుమలరెడ్డి అజయ్ అక్రమ సంపాదన సంపాదన పొందేందుకు కమిషన్ తీసుకుంటూ గదులను కేటాయించి పేకాటను ఆర్గనైజ్ చేస్తున్నారు.
పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి 15 మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వీరితోపాటు 14 మొబైల్ ఫోన్లు, 150760 నగదు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో వ్యవసాయదారులు, చేతి వృత్తిదారులు, ప్రభుత్వ ఉద్యోగి, పలువురు వ్యాపారస్తులు కూడా ఉండటం గమనార్హం. కాగా అక్రమంగా జూద శిబిరాలు నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. ఈ దాడుల్లో ములుగు ఎస్సై వెంకటేష్, సాయికృష్ణ, టిసిఎస్ ఎస్ఐ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.