ఆటో నుంచి పడి మహిళకు గాయాలు

28-11-2026 | 07:57pm

కన్నాయిగూడెం,(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం చింతగూడెం గ్రామానికి చెందిన దుర్గం నర్సక్క(35) శనివారం రోజున ఆటో(Auto ) నుంచి జారిపడి తీవ్రంగా గాయపడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే చింతగూడెం గ్రామం(Chintagudem Village) నుంచి కన్నాయిగూడెం వెళ్తుండగా ప్రయాణిస్తున్న ఆటో నుంచి ఆమె పర్సు కింద పడిపోయింది.

దీంతో పర్సు కోసం కిందకు చూస్తుండగా ప్రమాదవశాత్తు ఆటో నుంచి జారి కింద పడింది. ఈ ఘటనలో ఆమె తలకు తీవ్ర గాయమై తల పగిలింది. వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించడంతో పైలట్ సతీష్, ఈఏంటీ కళ్యాణ్ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని బాధితురాలిని ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు