విగ్రహం చోరీ ఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి

10-11-2026 | 10:23pm

కొల్లాపూర్ నవంబర్ 10: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం కుడికిల్ల గ్రామంలోని పురాతన శివాలయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు మంత్రికి ఆశీర్వచనం అందించారు. అనంతరం సుమారు 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలోని నంది విగ్రహం చోరీ కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించి నమోదైన కేసు దర్యాప్తు పురోగతిపై పోలీసు అధికారులను ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ... నంది విగ్రహం చోరీ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని, నిందితులను త్వరలోనే గుర్తించి పట్టుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జూపల్లి రఘుపతిరావు, కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ బచ్చలకూర బాలరాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు