43653 మంది పట్టభద్రుల ఓటర్ల నమోదు
18-11-2026 | 02:28pm
25న ముసాయిదా జాబితా.. డిసెంబర్ 30న తుది జాబితా
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): జిల్లాలో పట్టభద్రుల ఓటరు జాబితా రూపకల్పన ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్(Collector Hemant Keshav Patil) అధికారులను ఆదేశించారు. జిల్లాలోని నాగర్ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల పరిధిలో 43,653 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు తెలిపారు. వీటిలో 43,598 దరఖాస్తులు ఆమోదించగా, 55 పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ నెల 25న ముసాయిదా జాబితా, డిసెంబర్ 30న తుది జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు.