ఖైదీలు హక్కులు పొండాలి

03-11-2026 | 06:53pm

నాగర్‌కర్నూల్, నవంబర్ 3 ( విజయక్రాంతి ): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ(District Legal Services Authority) కార్యదర్శి నిహారిక మంగళవారం నాగర్‌ కర్నూల్ సబ్‌జైలును(Nagarkurnool Sub-jail) సందర్శించారు. ఖైదీలకు కల్పిస్తున్న వసతులు, ఆహారం, మెనూ అమలుపై ఆరా తీశారు.

న్యాయవాదిని నియమించుకునే ఆర్థిక స్థోమత లేని ఖైదీలకు సంస్థ తరఫున ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. వంటశాల, ఆహార పదార్థాలను పరిశీలించి, జైలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో సబ్‌జైలు సూపరింటెండెంట్ గుణశేఖర్ నాయుడు, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పవన శేషసాయి, జైలు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు