వడ్డేమాన్ శనేశ్వర స్వామి ప్రత్యేక పూజలు

28-11-2026 | 05:14pm

బిజినేపల్లి, నవంబర్ 28 : మండలంలోని నందివడ్డేమాన్  శ్రీ శనేశ్వరస్వామికి(Sri Saneswara Swamy of Nandivaddeman) భక్తులచే(devotees) వారి శని గ్రహ దోష నివారణకు వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు డా. గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి తెలిపారు. భక్తుల(Devotees) అర్థాష్టమ, అష్టమ, ఏలినాటి శని గ్రహదోష నివారణకు శనివారం వారిచే ప్రత్యేకంగా తిలతైలాభిషేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో ఆలయ ఆర్చకులు శాంతి కుమార్, ఉమమహేశ్వర్, సిబ్బంది గోపాల్ రెడ్డి, సేవకులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు