అండర్-19 క్రీడల్లో సత్తా చాటిన విద్యార్థులు
నేరేడుచర్ల, నవంబర్ 17(విజయ క్రాంతి): మహాత్మా జ్యోతిబాపూలే సొసైటీ(Mahatma Jyotiba Phule Society) ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయిలో దామరచర్లలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ లో మహాత్మా జ్యోతిబాపూలే గుడుగుంట్లపాలెం పాఠశాల -చిల్లేపల్లి విద్యార్థులు విజయం సాధించారు. అండర్-19 విభాగంలో జరిగిన పోటీలలో విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు.
వాలీబాల్ లో 2వ బహుమతి,హైజంప్ లో 2వ బహుమతి ,800 మీటర్ల పరుగు లో 2వ బహుమతి , లాంగ్ జంప్ లో 3వ బహుమతి సాధించారు. విజేతలను పాఠశాల ప్రిన్సిపాల్ ఉమాదేవి, పీఈటీలు ప్రియదర్శిని, అరుణ, ఏటీపీ విజయకుమారి, డీడబ్ల్యూ రజని, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఎంతో తోడ్పడతాయని అన్నారు. విజయం సాధించిన విద్యార్థులను మరింత ప్రోత్సహిస్తామని తెలిపారు.