సీఎం సభకు కాంగ్రెస్ శ్రేణుల సమాయత్తం
ప్రతి గ్రామం నుంచి వాహనాల ఏర్పాటు..
సభ విజయవంతానికి కాంగ్రెస్ శ్రేణుల కార్యాచరణ..
సిద్దిపేట రూరల్, నవంబర్ 17: ఈనెల 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొననున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు సిద్దిపేట రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమాయత్తమయ్యారు ఇందులో భాగంగా రాఘవాపూర్‌లో మండల కార్యకర్తల సమావేశం నిర్వహించి సభకు జనసమీకరణపై కార్యాచరణ రూపొందించారు. రూరల్ మండలంలోని ప్రతి గ్రామం నుంచి ప్రజలను సభకు తరలించేందుకు వాహనాలు ఏర్పాటు చేయాలని, గ్రామాల వారీగా బాధ్యతలు తీసుకొని ప్రజలను భారీ సంఖ్యలో సమీకరించాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్రం అంజిరెడ్డి, గారిపల్లి రాములు, జిల్లా కార్యదర్శి కోడారి మల్లారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రీక్కల మహేందర్ రెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్ అంజిరెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు గారిపల్లి వెంకట్, పుల్లూరు గ్రామ శాఖ అధ్యక్షుడు పుల్లూరి కనకయ్య గౌడ్, బచాయిపల్లి సర్పంచ్ ప్రేమలత యాదగిరి, ఉపసర్పంచ్ కాంతుల వెంకటేష్, మహిపాల్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, కొదాది రమేష్, గ్యార రఘుపతి, గడ్డం రాజిరెడ్డి, రెడ్డి బాలయ్య, బాబు బండి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.