కేపీహెచ్బీలో ‘మెగా ముకుంద’ ప్రారంభం
హాజరైన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): ప్రముఖ ఆభరణాల సంస్థ ముకుంద జ్యువెలర్స్(Mukunda Jewellers) తన 14వ శాఖ ను కూకట్‌పలి (కేపీహెచ్‌బీ)లోని పీఎన్ఆర్ ఎంపైర్(PNR Empire) మొదటి అంతస్తులో వైభవంగా ప్రారంభించింది. మెగా ముకుంద పేరుతో సరికొత్తగా ఏర్పాటు చేసిన ఈ స్టోర్ ను ముకుంద జ్యువెలర్స్ చైర్మన్ బత్తి నరసింహరెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు.
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్‌రెడ్డి హాజరై యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ము కుంద జ్యువెలర్స్ డైరెక్టర్లు డాక్టర్ నికితరెడ్డి, దాచేపల్లి కృ ష్ణ మాట్లాడుతూ.. సరికొత్త డిజైన్లు, నమ్మకమైన నాణ్యతతో వినియోగదారుల ముందుకు రావడం సంతోషం గా ఉందన్నారు. తరుగు కేవలం 6.99% మాత్రమే ఎటువంటి మేకింగ్ చార్జీలు (తయారీ కూలి) లేవు ఈ ప్రత్యేక ఆఫర్ ఈ నెల 4వ తేదీ నుండి 15వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు.