గురుకులం భూమి కబ్జాకు కుట్ర
- రూ.వెయ్యి కోట్ల విలువైన భూమిపై కాంగ్రెస్ ఎంపీ కన్ను
- ఎంపీకి మంత్రి అడ్లూరి మద్దతు!
- భూమిని స్వాధీనం చేసుకోకుంటే ఉద్యమం
- బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి(Congress in power) వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములకు(Government lands) రక్షణ లేకుండా పోయిందని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్(R.S. Praveen Kumar) ఆరోపించారు. హైదరాబాద్ శేరిలింగంపల్లిలో ఎస్సీ గురుకులానికి(SC Gurukula) కేటాయించిన రూ.1000 కోట్ల విలువైన 4.13 ఎకరాల భూమిని కాంగ్రెస్ ఎంపీ పోరిక బలరాంనాయక్(Balaram Naik) కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నా రని, ఈ వ్యవహారానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్(Adluri Lakshman) మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు .బుధవా రం తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.
ఎస్సీ విద్యార్థుల(SC students') కోసం కేటాయించిన భూమి లో ఎంపీ బలరాంనాయక్, ఆయన కుమారుడు కలిసి స్థానికులకు డబ్బులు ఇచ్చి గుడిసెలు వేయిస్తున్నారన్నారు. ఇక్కడ టీచర్ కెపాసిటీ బిల్డింగ్ సెంటర్ (టీసీబీసీ), గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలని 2013లోనే ప్రతిపాదనలు రూపొందించారని, అప్పటి ప్రభుత్వం ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు 31 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసిందని గుర్తు చేశారు. తాను గురుకులాల కార్యదర్శిగా ఉన్న సమయంలో ఎంపీ బలరాంనాయక్ తన వద్దకు వచ్చి సహకరించాలని కోరగా, సాధ్యం కాదని చెప్పానన్నారు. హైడ్రా, రెవె న్యూ, విజిలెన్స్ శాఖలు ఈ వ్యవహారంపై ఎం దుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు.
రేవంత్, పొంగులేటికి వందల ఎకరాలు ఎక్కడివి?
సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి వందల ఎకరాల భూములు ఎక్కడి నుంచి వచ్చాయని ఆర్‌ఎస్ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి పేరున గోపన్‌పల్లిలో 27 ఎకరాలు, వెల్దండలో 128 ఎకరాలు, నైమిషారెడ్డికి కొంపల్లిలో రెండున్నర ఎకరాలు, తిరుపతిరెడ్డికి కోస్గిలో వందల ఎకరాలు ఉన్నాయని ఆరోపించారు. కొట్రలో కొండల్‌రెడ్డికి, బాలాపూర్‌లో పొంగులేటికి 300 ఎకరాలకు పైగా, నార్సింగిలో మరో 27 ఎకరాలు ఉన్నాయని పేర్కొన్నారు. శేరిలింగం పల్లిలోని సర్వే 20/1లో బీసీ స్టడీ సర్కిల్ భూమిని కూడా అక్రమంగా సాస్ ఇన్ఫ్రాకు కేటాయించారన్నారు. శేరిలింగంపల్లిలోని 4.13 ఎకరాల భూమిని 15 రోజుల్లోగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, లేకపోతే సంక్షేమ భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.