రిటైర్మెంట్ ప్లానింగ్‌తో ఐసీఐసీఐ లైఫ్ సిగ్నేచర్ పెన్షన్
ముంబై: మార్కెట్ ఆధారిత రాబడులతో సంపదను సృష్టించుకోవడంతో పాటు పన్నులరహితంగా వారసత్వ ప్రణాళికలను కూడా అమలు చేసుకునే ఆప్షన్ని ఐసీఐసీఐ లైఫ్ సిగ్నేచర్ పెన్షన్(ICICI Life Signature Pension) పథకం అందిస్తుంది. 90 ఏళ్ల వరకు వెస్టింగ్ ఏజ్‌తో కస్టమర్లు తమ 40ల నుంచే రిటైర్మెంట్ ప్రణాళికలను ప్రారంభించవచ్చు. కాంపౌండింగ్ ప్రయోజనాలను పొందేలా సుదీర్ఘ సమయం పాటు పెట్టుబడులను కొనసాగించవచ్చు. “రిటైర్మెంట్ మరియు వారసత్వ ప్రణాళికలనేవి ఒకదాని వెంట మరొకటి ఉంటాయి.
అదే సమయంలో ఇలాంటి ఆర్థిక ప్రణాళికలు చాలా సంక్లిష్టంగా, పన్నులభారంతో ముడిపడినవై కూడా ఉండొచ్చు. ఐసీఐసీఐ లైఫ్ సిగ్నేచర్ పెన్షన్ ఈ రెండు సమస్యలను పరిష్కరించేలా రూపొందించబడింది. విస్తృత ఫండ్ ఆప్షన్ల నుంచి కస్టమరు తనకు నచ్చినది ఎంచుకుని, మార్కెట్ ఆధారిత నిధిని నిర్మించుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది. కస్టమరుకు పథకం నిధులు దఖలుపడే (వెస్టింగ్) సమయంలో 60 శాతం వరకు మొత్తాన్ని పన్నురహితంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. దీన్ని తదుపరి తరానికి వారసత్వంగా అందించవచ్చు. మిగతా మొత్తాన్ని యాన్యుటీ పథకాన్ని కొనుగోలు చేసేందుకు ఉపయోగించుకోవచ్చు. తద్వారా రిటైర్మెంట్ అనంతరం జీవితాంతం కచ్చితమైన ఆదాయాన్ని అందుకోవచ్చు.
దీర్ఘకాలిక సంపద సృష్టిని మార్కెట్ ఆధారిత రాబడులతో జోడించడం ద్వారా కస్టమర్లు తమకు మరియు తమకు ప్రియమైన వారి కోసం రిటైర్మెంట్, లెగసీ ప్లానింగ్‌కి అవసరమైన పటిష్టమైన పునాదిని ఈ ప్లాన్ అందిస్తుంది” అని ఐసీఐసీఐ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్ Mr. వికాస్ గుప్తా తెలిపారు. ఐసీఐసీఐ లైఫ్ సిగ్నేచర్ పెన్షన్ పథకం మొత్తం చెల్లించిన ప్రీమియంలు లేదా ఫండ్ విలువకు 105 శాతం అధికంగా కస్టమర్లకు డెత్ బెనిఫిట్ కింద అందిస్తుంది. కాబట్టి దురదృష్టవశాత్తూ పాలసీదారు కన్నుమూసినా, నామినీకి డెత్ బెనిఫిట్ ప్రయోజనాలు లభిస్తాయి.
ఒకవేళ పాలసీని జాయింట్ లైఫ్ ప్రాతిపదికన తీసుకుని ఉంటే, ప్రైమరీ పాలసీదారు కన్నుమూసినా, సెకండరీ లైఫ్ అష్యూర్డ్‌కి పాలసీ కొనసాగే విధంగా వెయివర్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ ఈ ప్లాన్‌లో అంతర్గతంగా ఉంది. ఇలాంటి సందర్భాల్లో సెకండరీ లైఫ్ అష్యూర్డ్ మరణానంతరం డెత్ బెనిఫిట్ అనేది నామినీకి చెల్లించబడుతుంది. తద్వారా ఈ పాలసీ ద్వారా చేసే చెల్లింపులు ఒక వారసత్వం కొనసాగడానికి తోడ్పడతాయి. అలాగే, బహుళ ఫండ్ ఆప్షన్లతో 100 శాతం ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడుల ద్వారా నిధిని ఏర్పర్చుకునే అవకాశాన్ని కస్టమర్లకు కల్పిస్తాయి. వివిధ ప్రీమియం పేమెంట్ ఆప్షన్లు, పాలసీ టర్మ్ ఆప్షన్లతో ఇది లభిస్తుంది. పాలసీ వ్యవధి 90 ఏళ్ల వరకు కూడా ఉంటుంది.