ముల్కనూర్ సహకార సంఘానికి జాతీయ పురస్కారం

21-11-2026 | 05:00am

అందుకున్న అధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి

భీమదేవరపల్లి, నవంబర్ 20 (విజయక్రాంతి): ముల్కనూర్ సహకార సంఘా(Mulkanoor Cooperative Society)నికి జాతీయస్థాయి పురస్కారం లభించింది. రైతులకు 70 ఏళ్ల పాటు విశిష్ట సేవలు అం దించినందుకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశవ్యాప్తంగా ఉత్తమ సంస్థలను గుర్తించి సత్కరించే ఇండియన్ కో-ఆ పరేటివ్ సబ్మిట్ ఎక్స్లెన్స్ అవార్డు కార్యక్రమంలో రైతులకు విశిష్ట సేవలు అందిస్తు న్నందుకు ముల్కనూర్ సహకార సంఘం అధ్యక్షులు అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి ఈ అవార్డు అందుకున్నారు.

ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఇండియన్ కో-ఆపరేటివ్ ఎడిటర్ అజయ్ ఝా, ఎన్ ఏఎఫ్‌సీయూబీ చైర్మన్ లక్ష్మీ దాస్, సహకార ఎన్నికల అథారిటీ చైర్‌ఫర్సన్ బీకేసింగ్, ఇఫ్కో మాజీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ యూఎస్ అవస్తి, నాబార్డ్ మాజీ డైరెక్టర్ సతీష్ మరాఠీ చేతుల మీదు గా ప్రవీణ్ రెడ్డి అవార్డు  స్వీకరించారు.   ప్ర వీణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముల్కనూర్ సహకార సంఘానికి జాతీయ స్థాయి లో అవార్డు లభించడం పట్ల సంతోషమన్నా రు. రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టి అధునాతన కార్యక్రమాలు చేపట్టి వీటి అమలు త్వరలో ప్రారంభం కానున్నదన్నారు. రైతుల విశ్వాసాన్ని సహకార విలు వలను రైతులకు భవిష్యత్తులో సేవలను అం దించి సంఘం ప్రస్థానంలో ఈ పురస్కారం ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు.

మరిన్ని వార్తలు