పుస్తక పఠనంతోనే ఉజ్వల భవిష్యత్తు
విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ అనిల్ కుమార్
హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి): డిజిటల్ యుగంలోనూ విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టి, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసేది పుస్తక పఠనమేనని విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ ఎస్ అనిల్ కుమార్ అన్నారు. 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో(National Library Week celebrations) భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్ముఖి గ్రామంలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో నవంబర్ 14 నుంచి 20 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
యూనివర్సిటీలోని ’విజ్ఞాన ధార’ లైబ్రరీలో విద్యార్థులకు పుస్తక ప్రదర్శన, వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్. అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్నప్పటికీ పుస్తకాలు అందించే లోతైన విజ్ఞానానికి సాటిలేదన్నారు. పుస్తక పఠనం తో ఏకాగ్రత, విశ్లేషణాత్మక ఆలోచనా శక్తి పెరుగుతాయని తెలిపారు. మంచి పుస్తకాలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి, నైతిక విలువ ల పెంపునకు దోహదపడతాయన్నారు.