ట్రంప్‌కు షాక్ తప్పదా?
- అమెరికా మధ్యంతరంలో 8 రాష్ట్రాల్లో భారీగా పోలింగ్ నమోదు
- పలు స్థానాల్లో రిపబ్లికన్, డెమోక్రటిక్ల హోరాహోరీ
- 5.76 కోట్లమంది ముందస్తు ఓటింగ్
- కాంగ్రెస్ 435, సెనెట్ 35 స్థానాలకు ఎన్నికలు
- పోటీలో ఆరుగురు భారతీయులు
వాషింగ్టన్, నవంబర్ 3: మధ్యంతర ఎన్నికల్లో(Midterm election) భారీగా పోలింగ్ నమోదు(Polling Registration) కావడం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(US President Donald Trump) రిపబ్లికన్ పార్టీకి(Republican Party) దడ పుట్టిస్తోంది. గత మధ్యంతర ఎన్నికలను మించిపోయే స్థాయిలో పోలింగ్ నమోదవుతుండడంతో ట్రంప్ పాలనాపరమైన ఆదేశాలకు ఇక మంగళం పడినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపుపోలింగ్ ప్రారంభం కాకముందే ముం దస్తు ఓటింగ్ ద్వారా 5.76 కోట్ల మంది ఓట్లను వేశారు. మంగళవారం ఉదయం ఎనిమిది రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది.
భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమైన పోలింగ్, బుధవారం ఉదయం 11:30 గంటల వరకు కొనసాగుతుంది. కనెక్టికట్, ఇండియానా, కెంటకీ, మైనే, న్యూహ్యాంప్‌షైర్, న్యూ జెర్సీ, వర్జీనియాలో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలు, సెనెట్‌లో 35 స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతుండ గా, 36 రాష్ట్రాల్లో గవర్నర్లు, స్థానిక మేయర్, కౌన్సిల్, అటార్నీ జనరల్ తదితర పదవుల ఎంపిక కోసం ఈ పోలింగ్ జరుగుతోంది. కాగా 50 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల కోసం 1000మంది ఎన్నికల పర్యవేక్షకులను మోహరించారు.
ఫ్లోరిడాలో 21 పోలింగ్ కేంద్రాల తరలింపు..
న్యూయార్క్‌లోని వెస్ట్ చెస్టర్ జిల్లాలో కొన్ని ఓటింగ్ యంత్రాలు బ్యాలెట్లను స్కాన్ చేయలేకపోయాయి. అదే సమయంలో ఫ్లో రిడాలో వరదల కారణంగా 21 పోలింగ్ కేం ద్రాలను వేరే చోటికి తరలించారు. పలు ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటువేసేందుకు చర్యలు చేపట్టారు. రెండేళ్ల తరువాత అమెరికా మధ్యంతర ఎన్నికలు జరుగుతున్నాయి. పలు రాష్ట్రాల గవర్నర్ పదవులు కూడా ఈ ఓటింగ్ ద్వారా నిర్ణయిస్తారు. కా గా ట్రంప్ రిపబ్లికన్ పార్టీ ప్రస్తుతం కాంగ్రెస్ ఉభయ సభల్లోనూ మెజారిటీని కలిగి ఉంది.
ఈ ఎన్నికల్లో మెజార్టీ సాధించకపోతే అధ్యక్ష పదవికి ఢోకా లేనప్పటికీ ఆయన నిర్ణయాల అమలు, ఆదేశాలు సాధ్యపడవు. అమెరికా సెనెట్‌లో మొత్తం వంద సీట్లున్నాయి. రిపబ్లికన్ పార్టీ (ట్రంప్)కి 53 సీట్లు ఉండగా, డెమోక్రటిక్ పార్టీ 45 సీట్లున్నాయి. డెమోక్రాట్లకు ఇద్దరు స్వతంత్ర సెనేటర్ల మద్దతు ఉం డడంతో వారి బలం 47గా ఉంది. అమెరికా పార్లమెంట్ దిగువ సభలో 435 స్థానాలుండగా 218 సీట్లు అంతకంటే ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీకి సభలో మెజార్టీ సాధిస్తుంది. ట్రంప్ ఉభయ సభల్లో మెజార్టీని కాపాడుకునేందుకు కొట్టుమిట్టాడుతుండగా, డెమో క్రాట్లు మెజార్టీని పెంచుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ప్రభావితం చేయనున్న సమస్యలు..
మరోవైపు అమెరికా ఇరాన్‌పై యుద్ధం తో దేశంలో డీజిల్ ధరలు 70 శాతం, పెట్రో ల్ ధరలు 50 శాతం పెరిగాయి. ట్రంప్ రే టింగ్ 31 శాతానికి పడిపోయింది. వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇది కూడా ట్రంప్ వ్యతిరేకతకు కారణమవుతుంది. కార్మిక కొరతకు దారితీసే ప్రమాదం పొంచి ఉంది. సుంకాల పెరుగుదల, నిరుద్యోగం, విదేశీయులను ఉద్యోగాల నుంచి తొలగించడం, రైతులపై ప్రతీకార సుంకాలు, గర్భస్రా వంపై మహిళలకు హక్కు తదితర ప్రధాన సమస్యలను తీర్చడంలో ట్రంప్ సర్కార్ విఫలమైనట్లు పలు సర్వేల ద్వారా ఇప్పటికే తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలో అన్ని పోల్స్‌లోనూ ఈసారి ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి ఎదు రుగాలి వీచే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా ఇటీవల నిర్వహించిన బైపోల్ సర్వేల్లో స్పష్టమైంది. పలు ప్రాంతాల్లో రిపబ్లికన్, డెమో క్రటిక్లకు హోరాహోరీ పోరు కొనసాగే అవకాశం ఉంది.