నేలకొరిగిన 11 కేవీ విద్యుత్ స్తంభాలు
పట్టించుకోని అధికారులు: ఇర్విన్ రైతుల ఆందోళన
మాడ్గుల, జూన్ 21(విజయక్రాంతి): మాడుగుల మండలం ఇర్విన్ మేజర్ పంచాయతీ లో వారం రోజుల క్రితం కురిసిన ఈదురుగాలల భారీ వర్షానికి 11 కేవీ విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇప్పటిదాకా ప్రమాదం పొంచి ఉన్నా విద్యుత్ అధికారులు స్పందించకపోవడంపై స్థానిక రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం స్థానిక భారత్ పెట్రోల్ బంక్ వెనుక భాగంలో విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా నేలపైనే పడి ఉన్నాయి.ఈ విషయమై విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించి వారం రోజులు గడుస్తున్నా,
ఇప్పటివరకు కనీసం అటువైపు వచ్చి కూడా చూడలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో పనులు చేసుకునే సమయంలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే ఆ 11 కేవీ విద్యుత్ స్తంభాలను, వైర్లను సరిచేసి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఇరువైన్ గ్రామ రైతులు డిమాండ్ చేస్తున్నారు.






