22 June, 2026 | 2:41 AM

నా కోసం రాజీనామా అనవసరం

22-06-2026 01:15 AM
  1. తెలంగాణ నుంచి ఎవ్వరూ చేయరు
  2. నాపై పార్టీలో ఎవరికీ కుట్ర చేయాల్సిన అవసరం లేదు 
  3. ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్ 

హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): ‘తెలంగాణలో నా కోసం ఎవరు కూడా రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయడం లేదు. ఈ వార్తలు పూర్తిగా అవస్తవం. నా రాజకీయం మధ్యప్రదేశ్‌లో ఉంటుంది’ అని ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. తమకు ప్రతి సీటు, ప్రతి సభ్యుడు ముఖ్యమేనని, కొన్ని సమయాల్లో మాత్రమే అలా అవుతుందని ఆమె చెప్పారు. ఆదివారం గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్‌తో కలిసి మీనాక్షి నటరాజన్ మీడియాతో మాట్లాడారు.

దేశం కోసం అవసరమైన్నప్పుడే అలా జరుగుతుందన్నారు. ‘నేను ఒక్కరితో రాజ్యసభ సీటు రాజీనామా చేయించలేను. అలా తీసుకునే అవసరం నాకు లేదు’ అని మీనాక్షి పేర్కొన్నారు. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ విషయంలో తాము ఒక్క నిమిషం కూడా నిరాశ చెందలేదని స్పష్టం చేశారు. ఎందుకంటే బీజేపీ ఎలాంటి రాజకీయం చేసిందో దేశానికి చుపించామన్నారు. రెండేళ్ల నుంచి రాహుల్ గాంధీ చెప్తున్నారు.. ఓటు చోరీ, సీటు చోరీ జరుగుతోందని, ఎవరు ఎందుకు లీక్ చేస్తారని మీనాక్షి అన్నారు.

కాంగ్రెస్‌కి ఉంది ఒక్క సీటు అని పేర్కొన్నారు. ఆర్వోలు బీజేపీ ఒత్తిడికి లొంగి, నామినేషన్‌ను తిరస్కరించారని ఆమె మండిపడ్డారు. ఈ పుకార్లు నామినేషన్ రిజెక్ట్‌కి ఒక్క రోజు ముందు నుంచే బీజేపీ ప్రచారం చేస్తోందని విమర్శించారు. తన నామినేషన్ తిరస్కరణ పై ఎలాంటి కుట్ర జరలేదని, పార్టీలో కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికీ లేదని చెప్పారు. తన ఇష్యూలో రిటర్నింగ్ ఆఫీసర్స్, ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కు అయ్యాయని మండిపడ్డారు.

ఫాల్స్ కేసులు కూడా కోర్టులో ఫైల్ చేస్తారని, నాపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని, కేవలం నోటీసు ఇచ్చారని తెలిపారు. ఫామ్ 26లో ఇలాంటి కేసులు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదని, తనను రిటర్నింగ్ అధికారి అడిగిన్నప్పుడు ఉందని చెప్పానని ఆమె తెలిపారు. ఆ కేసు 2016లో ఉందని, తాను తెలంగాణకు ఇన్‌చార్జిగా వెళ్లకముందు కేసు అని చెప్పానని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాంప్రమైస్డ్ అయిన్నట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

సుప్రీం కోర్టు చెప్పింది ఏంటి అంటే టెక్నికల్‌గా ఎలక్షన్ కమిషన్ రాజ్యసభ సభ్యులుగా సర్టిఫికెట్స్ ఇచ్చారని తెలిపారు. ‘మీరు ఎలక్షన్ కమిషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయాలి’ అని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ఒక వ్యక్తిపై ఉన్న అభియోగాలకు కుటుంబంలోని వారికి టికెట్ ఇవ్వకూడదని ఎక్కడా లేదని పేర్కొన్నారు. నామినేషన్ తిరస్కరణపై తాను ఇప్పటివరకు తక్కువగా మాట్లాడానని, ఈ ఇష్యూ కోర్టులో ఉండడంతో ఎక్కువగా మాట్లాడలేదన్నారు.

మధ్యప్రదేశ్‌లో 3 స్థానాలు ఖాళీగా ఉంటే.. ఒక్క స్థానానికి 58 సభ్యులు కావాలని, కాంగ్రెస్‌కి బలం ఉండడంతో నాకు టికెట్ ఇచ్చారని తెలిపారు. కానీ బీజేపీకి మూడో స్థానానికి అవకాశం లేకపోయినా నామినేషన్ వేసిందని ఆమె విమర్శించారు. ఫౌల్ గేమ్ ప్లాన్ చేసే బీజేపీ మూడో నామినేషన్ వేసిందని, డబ్బులతో, బెదిరింపులతో మూడోస్థానం రాదని బీజేపీ గ్రహించే.. నామినేషన్ తిరస్కరణ గేమ్ ఆడారని తెలిపారు.