22 June, 2026 | 1:37 AM

ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు తీరుస్తాం

22-06-2026 12:13 AM

ఎంపీ రఘు నందన్ రావు

రామాయంపేట, జూన్ 21 : జాతీయ రహదారిపై ఉన్న రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల కోసం వసతులు కల్పిస్తామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు హామీ ఇచ్చారు. ఆదివారం ఇక్కడి ఆసుపత్రి ఆవరణలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష శిబిరం ఏర్పాటయింది.

దీన్ని ప్రారంభించిన ఎంపీ విలేకరులతో మాట్లాడుతూ తరచూ ప్రమాదాలు జరిగే ఈ ప్రాంతంలో వైద్యుల కొరత పీడిస్తుందన్నారు. గైనక్ లేక ఐదేళ్లుగా ప్రసవాలు లేవన్నారు. తన దృష్టికి వచ్చిన ఈ సమస్యలు తీర్చేందుకు వైద్యుల నియామకం, డయాలసిస్ సెంటర్, డ్రామా సెంటర్ తో పాటు డెంటల్ చైర్, రోగులకు త్రాగునీటి కోసం ప్లాంటు ఏర్పాటు చేస్తామని అన్నారు. అలాగే ఎక్స్రే కు సంబం ధించి సి ఆర్ మిషన్ తెప్పించే ప్రయత్నం చేస్తానన్నారు.

కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి జ్ఞానేశ్వర్, బిజెపి జిల్లా అధ్యక్షుడు మల్లేశం, రామయంపేట కౌన్సిలర్ శంకర్ గౌడ్, మండల, పట్టణ అధ్యక్షులు నవీన్ గౌడ్, శీ లం అవినాష్ రెడ్డి, నవాత్ రాజు లు ఉన్నారు. తన సొంత ఆసుపత్రి అయిన శిశిరి ఆస్పత్రి సౌజన్యంతో ఆదివారం రామాయంపేటలో వందలాది రోగులకు ఉచిత క్యాన్సర్ పరీక్షలు చేయడం జరిగిందన్నారు. అంతేకాదు ఏదైనా క్యాన్సర్‌కు సంబంధించిన సర్జరీ చేయాల్సివస్తే తమ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందిస్తామన్నారు.