13-01-2026 10:53:00 AM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధి బుద్వేల్‌లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుద్వేల్ గ్రీన్ సిటీ వెంచర్ లో ప్లాస్టిక్ రీ సైక్లింగ్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడడంతో పరిసరాల్లో దట్టంగా పొగ వ్యాపించింది. దీంతో అక్కడి జనాలు భయంతో పరుగులు పెట్టారు. మంటల దాటికి విద్యుత్ 11 కేవీ వైరు తెగి పడిందని సిబ్బంది తెలిపారు. ప్రమాదం జరిగిన మున్సిపల్ సిబ్బంది చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 గంటలు శ్రమించి మంటలను అదుపుచేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.