15 April, 2026 | 3:10 AM

మహిళలకు 2వేలు

15-04-2026 12:33 AM
  1. ఏడాదికి మూడు సిలిండర్లు

తమిళ ఓటర్లకు బీజేపీ వరాలు

చెన్నై, ఏప్రిల్ 14: మూడు ఎల్పీజీ సిలిండర్లు ఉచితం, మహిళలకు నెలకు రూ. 2వేలు, జల్లికట్టు పోటీల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు 10 లక్షలు అందజేస్తామని తమిళనాడు బీజేపీ మ్యానిఫెస్టోలో ప్రకటించింది. మంగళవారం కేంద్రమంత్రి జేపీ నడ్డా పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు.

మహిళలకు ఇఠూ కొనుగోలుపై 25వేలు రాయితీ, జల్లికట్టు ఎద్దులను పెంచేవారికి రూ. 2వేలు సాయం, జల్లికట్టులో పోటీపడి మృతిచెందిన వారి కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా, మహిళలకు 8వేల గృహోపకరణాల కూపన్, ప్రతిఇంటికి ఒకేసారి రూ. 10వేలు సాయం అందిస్తామన్నారు.