calender_icon.png 28 May, 2025 | 12:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘అసిపె’ పుస్తక పరిచయ సభ

02-12-2024 12:00:00 AM

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో వనపట్ల సుబ్బయ్య దీర్ఘకావ్యం ‘అసిపె’ పుస్తక పరిచయ సభ రేపు (మంగళవారం) హైదరాబాద్, రవీంద్రభారతిలో జరుగుతుంది. కవి, విమర్శకులు పి.వహీద్‌ఖాన్ సభాద్యక్షత వహిస్తారు. శాసనమండలి సభ్యులు, ప్రజాకవి గోరటి వెంకన్న, తెలంగాణ సాహిత్య అకాడమి మాజీ అధ్యక్షులు జూలూరు గౌరిశంకర్, ప్రముఖ కవి, విమర్శకులు గుంటూరు లక్ష్మీనరసయ్య, ఓయూ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ ఎస్.రఘు, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు యాకూబ్, చరిత్ర పరిశోధకులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ సంగిశెట్టిశ్రీనివాస్, కాళోజీ అవార్డు గ్రహీతలు సీతారాం, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, న్యాయవాది ఉప్పల బాలరాజు, పుస్తక రచయిత వనపట్ల సుబ్బయ్య అతిథులుగా పాల్గొంటారు. నాగవరం బాల్ రాం, కోడెపాక కుమారస్వామి, సూర్యపల్లి శ్రీనివాస్, నారు, కందికొండ మోహన్ ప్రభృతులు ఆత్మీయ స్పందనలు తెలియజేస్తారు. 


 వనపట్ల సుబ్బయ్య 

9492765358