3 July, 2026 | 11:13 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

11 కిలోల గంజాయి పట్టివేత

30-06-2025 12:00 AM
  1. ముగ్గురు నిందితుల అరెస్ట్ 

వివరాలు వెల్లడించిన సీఐ సతీష్ కుమార్

భద్రాద్రి కొత్తగూడెం జూన్ 29 (విజయ క్రాంతి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని రెజీనా కాన్వెంట్ వద్ద కారులో అక్రమంగా రవాణా చేస్తున్న11. 100 కిలోల గంజాయిని పాల్వంచ పట్టణ ఎ స్త్స్ర సుమన్ పట్టుకున్నారు. ఒక కారును, 2సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సి ఐ సతీష్ కుమార్ వివరాలను వెల్లడించారు.

శనివారం సాయంత్రం పట్టణ ఎస్త్స్ర తన సి బ్బందితో పాల్వంచ పట్టణ పరిధిలోని రెజీ నా కాన్వెంట్ వద్ద వాహన తనకే చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ 28 సిఎల్ 3399 కారు లో అక్రమంగా రవాణా అవుతున్న గంజాయిని కనుగొన్నారు. కారులో ప్రయాణి స్తున్న ముగ్గురిని అదుపులో తీసుకొని విచారించగా గంజాయి తరలిస్తున్నట్లు అంగీకరిం చడంతో వారిపై కేసు నమోదు కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.

పట్టుబడిన వారి వివరాలుఖమ్మం జిల్లా చింతకాని మం డలం నాగులవంచ గ్రామానికి చెందిన కందిమల్ల శ్రీహరి, అదే గ్రామానికి చెందిన జొ న్నలగడ్డ రాకేష్ రెడ్డి, ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం మూష్టికుంట్ల గ్రామానికి చెందిన ఎస్ కే. జావేదుగా గుర్తించామన్నారు.