calender_icon.png 14 January, 2026 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

1,257 మంది ల్యాబ్ టెక్నీషియన్లు..

14-01-2026 02:05:33 AM

  1. భర్తీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ

నియామకపత్రాలు అందజేసిన మంత్రులు దామోదర, పొన్నం ప్రభాకర్

కోఠి ఉస్మానియా మెడికల్ కాలేజీలో కార్యక్రమం

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 13 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవ లను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు ఎంపికైన 1,257 మంది మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లకు మంత్రులు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ మంగళవారం నియామక పత్రాలను అందజేశారు. కోఠిలోని ఉస్మానియా మె డికల్ కాలేజీ మైదానంలో ఈ కార్యక్రమం అట్టహాసం గా జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. వైద్యా రోగ్య శాఖ చరిత్రలోనే ల్యాబ్ టెక్నీషియన్ల భర్తీలో ఇదే అతిపెద్ద రిక్రూట్మెంట్ అని స్పష్టం చేశారు.

పేదలకు మెరుగైన వైద్య పరీక్షలు అందుబాటులోకి తెచ్చేందుకే ఈ నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. 2024 సెప్టెంబర్ 11 న ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా 2025 నవంబర్ నాటికి ఏడాదిన్నరలోపే ఎంపిక ప్రక్రియను విజ యవంతంగా ముగించినట్లు తెలిపారు. ఎలాంటి అవక తవకలకు తావులేకుండా, అర్హత ఆధారంగానే ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు. నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.