17 July, 2026 | 12:50 AM

తెరపైకి సిల్క్‌స్మిత బయోపిక్

03-12-2024 03:04 AM

సౌత్ సినిమాను ఓ ఊపు ఊపిన ‘సిల్క్ స్మిత’ను మరోమారు తెరపై చూసే భాగ్యం ఆమె అభిమానులకు కలగబోతోంది. ఔను, సిల్క్ స్మిత జీవిత విశేషాలతో ఓ సినిమా రాబోతోంది. సౌత్ ఇండియన్ సినిమా ఐకాన్‌గా గుర్తింపు పొందిన సిల్క్‌స్మిత అఫీషియల్ బయోపిక్‌కు తెరకెక్కిస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ ఎస్‌టీఆర్‌ఐ సినిమాస్ సోమవారం ప్రకటించింది. ‘సిల్క్‌స్మిత క్వీన్ ఆఫ్ ద సౌత్’ పేరుతో ఈ బయోపిక్‌ను రూపొందిస్తున్నట్టు మేకర్స్ వెల్లడించారు.

ఆమె 64వ బర్త్‌డే సందర్భంగా టైటిల్ రోల్ ఫస్ట్‌లుక్, గ్లింప్స్‌ను విడుదల చేశారు. మూడు నిమిషాల లాంగ్ గ్లిమ్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. జయరామ్ శంకరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సిల్క్‌స్మిత పాత్రను చంద్రిక రవి పోషిస్తున్నారు. ఎస్‌బీ విజయ్ అమృతరాజ్ నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రొడక్షన్ పనులు ౨౦౨౫ మొదట్లోనే ఆరంభం కానున్నాయి.