calender_icon.png 19 October, 2025 | 3:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ సభ

19-10-2025 12:47:56 PM

హైదరాబాద్: చార్మినార్‌లో రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ సభ ఆదివారం జరిగింది. సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.  మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ప్రోత్సహించిన శాంతి, ఐక్యత, జాతీయ సమైక్యత సందేశాన్ని గుర్తుచేసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, మంత్రలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంత రావు, ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్, సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.