6 July, 2026 | 1:17 PM

Breaking News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •   ప్రియ మిల్క్ పార్లర్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్   •  

పురుడు పోసిన 108 సిబ్బంది.. తల్లీబిడ్డ క్షేమం..

08-09-2025 12:14 AM

మహబూబాబాద్, సెప్టెంబర్ 7 (విజయ క్రాంతి): పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళలకు 108 సిబ్బంది అంబులెన్స్ లో పురుడు పోశారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం పెద్ద తండకు చెందిన నిండు గర్భిణి నూనావత్ యాకమ్మకు ఆదివారం ఉదయం సమయంలో పురిటి నొప్పులు వస్తుండడంతో సహాయం కోసం 108 అంబులెన్స్ కాల్ చేశారు.

అంబులెన్స్ సిబ్బంది ఇంటికి చేరుకునే సమయంలో యాకమ్మకు పురి టి నొప్పులు తీవ్రమయ్యాయి. 108 అంబులెన్స్ సిబ్బంది అంబులెన్స్ =లోనే యాకమ్మకు కాన్పు నిర్వహించగా ఆడపిల్లకు జన్మనిచ్చింది.

తల్లి బిడ్డను మెరుగైన వైద్యం కోసం మహబూబాద్ ఏరియా  ఆసుపత్రికి తరలించగా, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు 108 సిబ్బంది తెలిపారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న యాకమ్మను సరైన సమయంలో వైద్య సహాయం అందించిన అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి ప్రభాకర్, పైలెట్ వెంకన్నలకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు