calender_icon.png 8 September, 2025 | 6:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్వాసితులకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

08-09-2025 12:13:19 AM

  1. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం
  2. నాలుగు విడతల్లో రూ. ఐదు లక్షల సాయం అందిస్తాం
  3. ఇప్పటి దాకా 2889 ఇండ్లు మంజూరు చేశాము..
  4. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
  5. మిడ్ మానేరు నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజి కింద ఐదు లక్షలు

రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 0౭ (విజయక్రాంతి): వేములవాడ అర్బన్ మండలం. మిడ్ మానేర్ నిర్వాసితులకు మేలు చేయాలన్నదే. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. వేములవాడ అర్బన్ మండలం అగ్రహరంలో ఫంక్షన్ హాల్. మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్వాసితులు 1550 మందికి ప్రత్యేక ప్యాకేజి కింద ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను.

ఆదివారం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించి. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు. లబ్దిదారులకు ఇందిర మ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్ మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీదర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఇతర మంత్రులు ఈ ప్రాంత అభివృద్ధికి మద్దతుగా నిలుస్తున్నారని వివరించారు.

రూ.240 కోట్లతో ముంపు గ్రామాల ప్రజలకు 4696 ఇల్లు మంజూరు చేశామని వెల్లడించారు. ప్రత్యేక ప్యాకెజి కింద ముంపు గ్రామాల నిర్వాసితులకు ఇళ్ళు లేని. ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అందరికి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. 18 సంవత్సరాల వయసు దాటిన వారి సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని భరోసా ఇ చ్చారు. సమస్యల పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు.

మిడ్ మానేరు ప్రాజెక్ట్ నిర్మాణములో నిర్వాసితులైన 9 గ్రామాలలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా 1,550 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశామని, ఒక్కో ఇంటికి రూ. ఐదు లక్షల చొప్పున లబ్ధి చేకూరనున్నదని తెలిపారు. గత మే మాసములో దాదాపు 389, ప్రత్యేక కోటా కింద 950, ప్రస్తుతం 1550 తో కలిపి 2889 ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని విప్ వెల్లడించారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఇది నిరంతర ప్రక్రియనే స్పష్టం చేశారు. కార్యక్రమంలో వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, సింగిల్ విండో రేగులపటి కృష్ణ దేవరావు, హౌసింగ్ శాఖ పీడీ శంకర్, మండల ప్రత్యేక అధికారి, జిల్లా ఆడిట్ అధికారి శ్రీనివాస్, వేములవాడ తహసీల్దార్ విజయ్ ప్రకాష్, ఎంపీడీఓ రాజీవ్ మల్హోత్ర తదితరులు పాల్గొన్నారు.