calender_icon.png 8 September, 2025 | 6:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవభారత నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

08-09-2025 12:15:44 AM

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ టౌన్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): నవభారత నిర్మాణానికి ఉపాధ్యాయుల పాత్ర కీలకం అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని శ్రీ రాఘవేంద్ర మినీ ఫంక్షన్‌హాల్లో జరిగిన ప్రైవేట్ ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడుతూ సగటు ఉపాధ్యాయుడికి గౌరవం ఇవ్వడం అంటే మన రాబోయే తరానికి సన్మానం చేసినట్టే అన్నారు.

రాబోవు రోజుల్లో తప్ప ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు.  అనంతరం ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.  రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూర వెంకట్, ముజీబ్, కమిటీ సభ్యులు డోలి రాజు, అస్మా బేగం, అనిశెట్టి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

సామరస్య ర్యాలీని ప్రారంభించిన నాయిని..

మతసామరాస్యానికి ప్రతీక మిలాద్-ఉన్-నబి ర్యాలీ అని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.హనుమకొండ చౌరస్తా నుంచి హజ్రత్ అబ్దుల్ నబీ షా సాహెబ్ దర్గా వరకు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం దర్గా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మతసామరస్యానికి ప్రత్యేక ర్యాలీ అని,ప్రవక్త హజ్రత్ మహమ్మద్ ముస్తఫా యొక్క జన్మదినమైన రోజు న ఆయన చూపిన మార్గం శాంతి, సహనం, ప్రేమ, దయ ,మనం గుర్తు చేసుకోవాల్సిన సమయం అని అన్నారు.

ప్రవక్త యొక్క జీవితం అనేది మానవతకు మార్గదర్శనం అన్నారు. ఆయన ఉపదేశాలు సమాజానికి శాశ్వత విలువలు అందించాయని,ఆయన చూపిన ప్రేమ మరియు ఐక్యత మార్గాన్ని మనం అనుసరించాలని తెలిపారు.  రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ కుస్రూ పాషా, జిల్లా మైనారిటీ చైర్మన్ అజీజ్ ఉల్లా, మాజీ కార్పొరేటర్ అబూబకర్, బోడ డిన్న, రజాలి, తబు పాల్గొన్నారు.