మొదటి రోజు ఇంటర్ పరీక్షలకు 359 మంది విద్యార్థుల గైర్హాజరు
- 42 పరీక్ష కేంద్రాల్లో 10, 201 విద్యార్థుల హాజరు
సిద్దిపేటలో పరీక్షల నిర్వహణను పరిశీలించిన కలెక్టర్ హైమావతి
గజ్వేల్, ఫిబ్రవరి 25: సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఎలాంటి అవాంఛిత సంఘటనలు లేకుండా పరీక్షను అధికారులు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 42 పరీక్ష కేంద్రాలలో 10,560 విద్యార్థులు పరీక్షలు రాయడానికి ఏర్పాట్లు చేయగా, జనరల్ 7868, ఒకేషనల్ 2333, మొత్తం 10,201 మంది విద్యార్థులు పరీక్షలను రాశారు. జనరల్ 195, ఒకేషనల్ 164, మొత్తం 359 మంది విద్యార్థులు మొదటిరోజు ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలకు గైర్హాజరయ్యారు.
బుదవారం జిల్లా కేంద్రంలోని ప్రగతి జూనియర్ కళాశాల లో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్ కె. హై మావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంటర్మీడియట్ బోర్డు మార్గదర్శకాల ప్రకారం అత్యంత పారదర్శకంగా విద్యార్థులు ప్రశాంత వాతావరణం లో పరీక్ష రాసేలా విధులు నిర్వహించాలని చీఫ్ సూపరిండెంట్ ను ఆదేశించారు. ఎక్కడా ఎలాంటి మాస్ కాపీయింగ్ జరగకుండా చూసుకోవాలని, పరీక్ష కేంద్రంలోకి పోన్ అనుమతి లేదని, పూర్తి చెక్ చేశాకే లోపలికి అనుతిం చాలన్నారు. సెంటర్ చుట్టు 144 సెక్షన్ అమలుతో పాటు గట్టి బందోబస్తు నిర్వహించాలని పోలిస్ అధికారులను ఆదేశించారు.




