calender_icon.png 13 September, 2024 | 1:18 AM

జపాన్ లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ

08-08-2024 04:09:37 PM

టోక్యో: జపాన్ ను భారీ భూకంపం వణికించింది. గురువారం దక్షిణ తీర ప్రాంతంలో క్యూషు ద్వీపం సమీపంలో ఇది సంభవించింది. 30 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు సమాచారం. కాగా రెక్టర్ స్కేల్ పై దాని తీవ్రత 7.1గా  నమోదైందని తెలిపింది. దాంతో అధికారులు  సునామీ హెచ్చరికలు జారీ చేశారని జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది.