07-07-2025 01:53:26 AM
- ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్
- నాలుగు గ్రామాల రైతులకు బేగరి కంచెలో ప్లాట్లు కేటాయింపు
- 642 ఎకరాలు 5,480 మంది లబ్ధిదారులు
- ఒక ఎకరాకు 121 గజాలు
రంగారెడ్డి, జూలై 6 (విజయక్రాంతి): ఎట్టకేలకు ఫార్మా బాధిత రైతులకు ఇంటి జాగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం లో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి నియోజకవర్గంలో 19,333 ఎకరాల భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
దాన్లో భాగంగా ఇప్పటివరకు 13,972 ఎకరాలను ప్రభుత్వం సే కరించింది. బాధిత రైతులకు పరిహారం కిం ద పట్టా భూములకు రూ.16.5 లక్షలు అసై న్డ్ భూములకు రూ.8.5 లక్షలు ప్రభుత్వం పరిహారంగా అందజేసింది. దాంతో పాటు భూములు కోల్పోయిన రైతులకు ఇండ్ల జా గా ఇస్తామని హామీ ఇచ్చింది.ఇప్పటికే భూ ములు కోల్పోయిన బాధిత రైతులకు ఇళ్ల స్థలాల కేటాయింపు రిజిస్ట్రేషన్ల ప్రక్రియకో సం అధికారులు కసరతులు పూర్తి చేసి ప్రొసీడింగ్లను అందజేశారు.
కందుకూరు మండ లంలోని మీర్ఖాన్పేట్ గ్రామపంచాయతీ పరిధిలోని బేగరి కంచె లో సర్వేనెంబర్ 90లో 642 ఎకరాల్లో 5,480 మంది బాధిత రైతులకు ప్లాట్లను కేటాయించేందుకు అన్ని వసతి సౌకర్యాలతో కూడిన వెంచర్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. గత ప్రభుత్వంలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహారం కింద ఒక ఎకరాకు ఒక గుంట లో 121 గజాలు ప్లాట్లను కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
హామీ లో భాగంగా ప్లాట్ల పంపిణీ ప్రక్రియ ను ప్రభుత్వం స్పీడ్ అప్ చేసింది.జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి శనివారం ప్రత్యేకంగా బేగరి కంచె లో పర్యటించి రైతులకు కేటాయించే వెంచర్లోని ప్లాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. శాస్త్రీయ పద్ధతిలో ఎక్కడ ఇబ్బందు లు కలగకుండా డ్రా పద్ధతిలో రైతులకు పా ట్ల కేటాయింపు ప్రక్రియను చేపట్టనున్నట్లు ఆయన వివరించారు.
మొదటి విడతలో 5480 మంది కి ( టీజీఐఐసీ ) తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాలు అభివృద్ధి సంస్థ చేసి న లేఅవుట్లో మొదటి విడతలో 5,480 మంది బాధిత రైతులకు ప్లాట్ల ను అధికారులు పంపిణీ చేయనున్నారు. పంపిణీ ప్రక్రియలో చేపట్టే విధివిధానాల గురించి ఆర్డిఓ జగదీశ్వర్ రెడ్డి సంబంధిత అధికారులకు శిక్షణను పూర్తి చేశారు. నేడు ఉదయం 8 గం టల నుంచి ప్లాట్ల పంపిణీ లాటరీ విధానం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రారంభించనున్నారు.
కందుకూరు, ఇబ్రహీంపట్నం ఆర్డీవోలు జగదీశ్వర్ రెడ్డి, అనంతరెడ్డి ఈ ప్ర క్రియ మొత్తము పర్యవేక్షణ చేయనున్నారు. కురిమిద్ద గ్రామంలో 1240,నానక్ నగర్లో 359, మేడిపల్లిలో 161, తాటిపర్తి లో 545 మంది రైతుల పూర్తి జాబితాను రూపొందించారు. అర ఎకరం మొదలుకొని ఐదు ఎక రాల వరకు రైతులు భూములు కోల్పోయా రు. 40 గుంటలలో ఒక భూములు కోల్పోయిన రైతులకు 60 గజాలు, ఎకరం నుంచి రెండు ఎకరాల లోపు ఉన్నవారికి 181 గజా లు, ఐదెకరాలు కోల్పోయిన రైతులకు 600 గజాలు కేటాయించనున్నారు.
కందుకూరు రెవెన్యూ డివిజన్లో 1580, ఇబ్రహీంపట్నం డివిజన్లో 3900 మంది రైతుల కు సంబంధించి ఇప్పటికే ఆయా గ్రామాలలో లబ్ధిదా రుల తో కూడిన జాబితాను రూపొందించి గ్రామపంచాయతీ కార్యాలయంలో నోటీసు బోర్డుల వద్ద ప్రదర్శించారు. రైతులకు ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ గురించి అనంతరం సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో స్లాడ్స్ బుక్ చేసి లబ్దారుల కాయ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయనున్నారు.
శాస్త్రీయ పద్ధతిలో డ్రా సిస్టం
ఫార్మాలో భూములు కోల్పోయిన బాధిత రైతులకు శాస్త్రీయ పద్ధతిలో ప్లాట్ల కేటాయింపుల ప్రక్రియ చేపట్టనున్నాం. ఇప్పటికే సంబంధిత అధికారు లకు పలు సలహాలు, సూచనలు చేశాం. జడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, పంచాయతి అధికారి సురేష్ మోహన్ సంబంధిత ఆర్డీవోలు, తాసిల్దార్ లో మొత్తం ప్రక్రియను పర్యవేక్షణ చేస్తున్నారు.
డ్రా పం పిణీలో ఆయా గ్రామాల రైతుల సమక్షంలోనే ప్లాట్ల కేటాయింపుల ప్రక్రియ చేపడతాము ఇందులో ఎలాంటి ఆపోవాలు పెట్టు కోవాల్సిన అవసరం లేదు. అర్హులందరికీ ప్లాట్లు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. బాధిత రైతులు తమ వెంట ఆధార్ కార్డు జిరాక్స్, పాన్ కార్డు జిరాక్స్,రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తమ వెంట తీసుకొని రావాలి.
నారాయణరెడ్డి, కలెక్టర్ రంగారెడ్డి