calender_icon.png 7 July, 2025 | 6:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాంసం తినేవారు బీజేపీలో ఉండొద్దా?

07-07-2025 12:34:22 AM

-టోపీ ఉన్నవాళ్లతో మాట్లాడబోమంటే ఎలా!

-దేశభక్తి చాటుకోవాలంటే ఆర్‌ఎస్‌ఎస్, బజరంగ్‌దళ్‌లో చేరండి

-బీజేపీ రాజకీయ పార్టీ, రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయాలి 

-అందరినీ కలుపుకొని పోవాలి 

-ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

వికారాబాద్, జూలై- 6 (విజయక్రాంతి): “మాంసం తినేవా రు బీజేపీలో ఉండొద్దని, టోపీ ధరించేవారితో మాట్లాడబోమని అంటే ఎలా? దేశభక్తిని చాటుకోవాలంటే ఆర్‌ఎస్‌ఎస్, బజరంగ్‌దళ్‌లో చేరండి. బీజే పీ ఓ రాజకీయ పార్టీ, అందరినీ కలుపుకొనిపోతేనే రాజ్యాధికారం సాధ్యమవుతుంది” అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్‌తో కలిసి జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీలో కొనసాగే ప్రతి వ్యక్తి అన్ని వర్గాల వారితో కలిసిపోయి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.

మాంసం తినే వారిని, టోపీ ధరించే వారిని కలుపుకుని పోతేనే పార్టీ మనుగడ సాధిస్తుందని చెప్పారు. మాంసం తినేవారితో, టోపీ ధరించే వారితో మాట్లాడబోమంటే ఎలా అని ప్రశ్నించారు. బేషజాలు ఉంటే మరో దారి చూసుకోవాలని సూచించారు. దేశభక్తి చూపించుకోవడానికి ఆర్‌ఎస్‌ఎస్, బజరంగ్‌దళ్ లాంటి వేదికలు ఉన్నాయని వాటిలో చేరాలని సూచించారు.

ఇతర పార్టీల్లోలాగా కిందిస్థాయిలో కార్యకర్తలు సరిగ్గా పనిచేయడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మతం, కులం అనే భేషాజాలు పక్కనపెట్టి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూ చించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో జిల్లాలో 5 వేల వార్డు మెంబర్లు, 500 మంది సర్పంచ్‌లను గెలిపించుకోవల్సిన అవసరం ఉందని హి తబోధ చేశారు.

పార్టీ అధ్యక్ష పదవుల కోసం, నామినేటెడ్ పదవుల కోసం పాకులాడితే లాభం లేదన్నా రు. కష్టపడి పని చేసే వారిని పార్టీ గు ర్తిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షుడు సదానంద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.