calender_icon.png 7 July, 2025 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఇరిగేషన్’లో పదోన్నతులకు పంగనామం

07-07-2025 12:41:04 AM

-ఏళ్లుగా పెండింగ్‌లో ప్రమోషన్ ఫైల్ 

-సీనియారిటీ జాబితాలో గందరగోళం 

-కాళేశ్వరం విజిలెన్స్  రిపోర్టుతో మరింత జాప్యం 

-అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇంజినీర్లు 

-తద్వారా శాఖాపరమైన కార్యకలాపాలపై ప్రభావం 

-తక్షణమే సమస్య పరిష్కరించి పదోన్నతులు కల్పించాలని విజ్ఞప్తి

హైదరాబాద్, జూలై 6 (విజయక్రాం తి): రాష్ట్రానికి సంబంధించిన పాలనలో నీటిపారుదల శాఖ ఎంతో ముఖ్యం. అన్ని రంగాల అభివృద్ధితో ముడిపడి ఉన్న వ్యవసాయ రంగంలో నీటిపారుదల శాఖ పాత్ర కీలకం. నీటిపారుదల శాఖ లక్ష్యాలు నెరవేర్చడంలో ఇంజినీర్ల కృషి ఎంతో ఉంటుంది. అలాంటి ఇంజినీర్లకూ తిప్పలు తప్పడం లేదు.

తెలంగాణ ఏర్పాటైన తర్వా త సాగునీటి రంగంలో ఎంతోమంది ఇం జినీర్లు వివిధ స్థాయిల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. కానీ వారి కృషికి తగిన పదోన్న తులు లభించడం లేదని వారిలో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నప్పటికీ ఇరిగేషన్ శాఖ పదోన్నతుల సమస్య పరిష్కారం కావడం లేదు.

ప్రమోషన్ల ఫైల్ ముందుకు కదలకపోవడంతో అర్హత ఉన్న ఇంజినీర్లు ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి గతంలో ఇరిగేషన్ శాఖ పదోన్నతులకు కొన్ని న్యా యపరమైన చిక్కులున్నా.. అవి ప్రస్తుతం తొలగిపోయాయి. పదోన్నతుల కల్పించే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసింది.

అయినప్పటికీ ఫలితం మాత్రం శూన్యంగా కన్పిస్తుంది. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ నివేదిక పలువురు ఇంజినీర్లపై వేటు వేయాలని సిఫార్సు చేసింది. దీంతో సమస్య మరింత సంక్లిష్టంగా మారి, వందలాది ఇంజనీర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 

సీనియారిటీ జాబితాలో గందరగోళం

దాదాపు 12- ఒకే హోదాలో పనిచేస్తున్నా పదోన్నతులు రాకపోవడంతో ఇంజినీర్లు తీవ్ర నిరాశలో ఉన్నారు. ప్రభుత్వం మా రినా తమ పరిస్థితి మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి తాత్కాలిక ప్రమోషన్లతోనే కాలం వెళ్లదీస్తున్నామని, సీనియారిటీ జాబితాలో గందరగోళానికి దారితీస్తోందని వాపోతున్నారు.

గతం లో జోన్ జోన్‌ఛా సంబంధించిన సీనియారిటీ వివాదానికి సంబంధించిన కేసును హైకోర్టు కొట్టేసింది. దీంతో పదోన్నతులకు అడ్డంకులు తొలగిపోయాయని ఇంజినీర్లు భావించారు. అయితే ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఐదుగురు సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఆరు నెలలు గడిచినా ఇప్పటికీ ఎలాంటి నివేదిక రాలేదు.

ఈ జాప్యం వల్ల అర్హులైన ఇంజినీర్లు తమకు న్యాయంగా రావాల్సిన ప్రమోషన్లను కోల్పోతున్నారు. చాలా మంది ఇంజినీర్లు ప్రమోషన్ రాకుండానే పదవీ విరమణ పొందుతున్నారు. ఇరిగేషన్ శాఖలోని పదోన్నతుల ప్రక్రియకు కాళేశ్వరం ప్రాజెక్టు విజిలెన్స్ రిపోర్టు మరింత సమస్యాత్మకంగా మారింది.

ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలకు బాధ్యులుగా తేలిన పలువురు ఇంజి నీర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ రిపోర్టు సిఫార్సు చేసింది. ఈ నివేదిక ఆధారంగా ఇప్పటికే కొంతమంది ఇంజినీర్లకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజినీర్ల విషయంలో స్పష్టత వచ్చేవరకు ప్రమోషన్ల ప్రక్రియను నిలిపివేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. 

కార్యకలాపాలపై ప్రభావం

ప్రస్తుతం శాఖలో సుమారు 200 డీఈ ఈ, 50 ఈఈ, 35 సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్‌ఈ), 18 చీఫ్ ఇంజినీర్ (సీఈ) స్థాయి పదోన్నతులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ప్రమోషన్ల ప్రక్రియ నిలిచిపోవడంతో శాఖాపరమైన కార్యకలాపాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతోందని అధికారులు చెబుతున్నారు.

ఈ సమస్య పరిష్కారం కోసం 2004 బ్యాచ్‌కు చెందిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ఇటీవల ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి పరిస్థితి ఆయనకు వివరించారు. 12 ఏళ్లకు పైగా ఒకే పోస్టులో పనిచేస్తున్న తమకు తక్షణమే ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు(ఈఈ)గా పదోన్నతి కల్పించాలని కోరారు.

మంత్రి సానుకూలంగా స్పందించారని, కానీ క్షేత్రస్థాయిలో ప్రక్రియ ముందుకు సాగడం లేదని ఇంజినీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని ఇంజినీర్లు కోరుతున్నారు.