07-07-2025 01:52:41 AM
ఎల్బీనగర్, జూలై 6 : సోషల్ జస్టిస్ అండ్ ఉమెన్ ఎంపవర్మెం ట్ బోర్డును బలోపేతం చేసి సా మాజిక న్యాయం, మహిళా భద్ర త, సత్వర న్యాయం కోసం కృషి చేస్తామని సోషల్ జస్టిస్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ బోర్డు రా ష్ట్ర చైర్మన్ దోర్నాల సత్యం నారాయణ అన్నారు. దిల్ సుఖ్ నగర్ లోని ఓ కన్వెన్షన్ లో ఆదివారం రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సోషల్ జస్టిస్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ బోర్డు చేపట్టే కార్యక్రమాలపై చర్చించారు.
ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ సామాజిక న్యాయం, మహిళా సాధికారత కోసం బోర్డు కృషి చేస్తుందన్నారు. ఆగస్ట్ నెలలో సోషల్ జస్టిస్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ బోర్డు మినిస్ట్రీస్ కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో బోర్డు విధి విధానాలు, అడ్ హాక్ కమిటీని ప్రకటించనున్నట్లు చైర్మన్ దోర్నాల సత్యం నారాయణ తెలిపారు. త్వరలో జిల్లా స్థాయి కమిటీలు నియమించి బోర్డును బలోపేతం చేస్తానన్నారు. సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బొడ్డుపల్లి రాజు, ఉదయ్ కుమార్, వేమారెడ్డి, హారిక, సరిత, రమా, అక్షర తదితరులుపాల్గొన్నారు.