07-07-2025 01:54:04 AM
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
ఎల్బీనగర్, జూలై 6 : కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన నాలుగు లేబర్ కో డ్ లను వెంటనే రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఎల్బీనగర్ స ర్కిల్ హస్తినాపురం డివిజన్ నందనవనంలో జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా జీహెచ్‌ఎంసీ ఎంప్లాయిస్ యూనియన్ ఎల్బీనగర్ సర్కిల్ కార్యదర్శి ఆలేటి ఎల్లయ్య అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రమోహన్, నర్సిరెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను కాపీలను తగలబెట్టారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ ను వెంటనే రద్దు చేయాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 10 గంటల పని దినాలను జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.చంద్రమోహన్, జిల్లా కమిటీ సభ్యుడు నర్సిరెడ్డి, ఆర్టీసీ యూనియన్ రాష్ట్ర నాయకులు రవీంద్రారెడ్డి, నందనవనం శాఖ కార్యదర్శి మంతాని యాదయ్య, నాయకులు దండు రాధ, గడ్డం రవీందర్, కుమార్, ఎల్‌ఐసీ లక్ష్మయ్య, గంధం మనోహర్, రాధమ్మ, అంజమ్మ, లక్ష్మీదేవి, లక్ష్మణ్, లింగమ్మ తదితరులుపాల్గొన్నారు.