TVK ఆపరేషన్ ఆకర్ష్..! విజయ్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఫిక్స్
చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు తమిళగ వెట్రి కళగం(Tamilaga Vettri Kazhagam) సిద్ధమైంది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ పిలుపు కోసం టీవీకే ఎదురుచూస్తోంది. టీవీకే అధినేత విజయ్ రేపు చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. తమిళనాడులో ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ సీట్లు(118) దక్కలేదు. దీంతో టీవీకే మ్యాజిక్ ఫిగర్‌కి అవసరమైన ఎమ్మెల్యేల కోసం ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది.
తమిళనాడు రాజకీయాల తాజా అప్డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి.
2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. టీవీకే పార్టీ తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 10 సీట్లు అవసరం. 5 సీట్లలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మద్దతుతో టీవీకే బలం 113కు చేరింది. కాంగ్రెస్ మద్దతు తెలిపిన ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకు మరో ఐదు సీట్లు అవసరం.అన్నాడీఎంకే కూటమిలోని పీఎంకే పార్టీ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వనున్నట్లు సమాచారం.
మరిన్ని తెలంగాణ తాజా వార్తల కోసం విజయక్రాంతి న్యూస్‌ను ఫాలో అవ్వండి.
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో పీఎంకే నాలుగు స్థానాల్లో గెలుపొందింది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చేందుకు ఐయూఎంఎల్ ముందుకొచ్చింది. టీవీకేకు.. డీఎంకే కూటమిలోని సీపీఎం, సీపీఐ, వీసీకే పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం కూడా ఉంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్ 2 సీట్ల చొప్పున గెలిచాయి. ఈ మూడు పార్టీలు మద్దతిస్తే టీవీకే బలం 125కు చేరుకోనుంది.
ప్రశ్నలు – సమాధానాలు:
1. టీవీకేకు ఎంత మెజారిటీ అవసరం?
ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 118 సీట్లు అవసరం.
2. విజయ్ పార్టీ ఎంత సీట్లు గెలిచింది?
టీవీకే పార్టీ 108 సీట్లు గెలుచుకుంది.
3. విజయ్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు?
విజయ్ రేపు చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇవి కూడా చదవండి:
తమిళనాడులో సంచలన ఫలితాలు.. విజయ్ TVK రికార్డు
బీజేపీ ఆఫర్‌కు టీవీకే నో! — 80 సీట్లు, డిప్యూటీ సీఎం పదవి ప్రతిపాదనను ఖండించిన విజయ్ పార్టీ
Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం
ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన
బెంగాల్ బీజేపీదే.! భవానీ పూర్‌లో ఆధిక్యంలో మమతా బెనర్జీ
బ్లాక్ బస్టర్ :తమిళ జన నాయకుడు విజయ్
చరిత్ర సృష్టించిన విజయ్.. దళపతి ప్రస్థానం ఇదే..!






