ఆటో డ్రైవర్ నుంచి అసెంబ్లీకి
- తమిళనాడు రాయపురం నుంచి టీవీకే అభ్యర్థి విజయ్ దాము విజయం
- డీఎంకే అభ్యర్థిపై 14 వేల మెజార్టీతో గెలుపు
- గతంలో ఐదుసార్లు గెలిచిన అన్నాడీఎంకే అభ్యర్థికి మూడోస్థానం
చెన్నై, మే 4: తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ తరఫున పోటీచేసిన ఓ ఆటో డ్రైవర్ ఘన విజయం సాధించి, అసెంబ్లీలో అడుగుపెట్టనున్నాడు. కె విజయ్ దాము అనే ఆటో డ్రైవర్‌కు టీవీకే అధ్యక్షుడు విజయ్ రాయపురం నియోజకవర్గ టికెను ఇచ్చాడు. బరిలోకి దిగిన విజయ్ దాము.. దాదాపు 59 వేల ఓట్లు సాధించి తన సమీప అభ్యర్థి అయిన డీఎంకే అభ్యర్థి సుబైర్ ఖాన్‌పై 14 వేల ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు.
ఇలాంటి ఎన్నికల ఫలితాలు, రాజకీయ విశ్లేషణ కోసం మా Politics విభాగాన్ని చదవండి.
ఈ నియోజకవర్గంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు కేవలం 18 వేల ఓట్లు మాత్రమే సాధించి మూడో స్థానానికే పరిమితం కావడం విశేషం. విజయ్ దాము నిత్యం ప్రజలతో మమేకమవుతుండేవారు. ప్రజల్లో ఉండటమే ఆయనకు ఈ ఎన్నికల్లో కలిసి వచ్చింది. అభ్యర్థి ప్రకటన సమయంలో పార్టీ అధినేత విజయ్.. దామును కౌగిలించుకుని కంటతడి పెట్టిన ఫొటో కూడా విపరీతంగా వైరల్ అయ్యింది. ఆటో స్టాండ్ నుంచి అసెంబ్లీకి వెళ్తున్న విజయ్ దాము ప్రస్థానం అందరినీ ఆకట్టుకుకోవడం విజయ్ సృష్టించిన రాజకీయ సునామీకి అద్దం పడుతోంది.
దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు, తాజా రాజకీయ వార్తల కోసం Vijayakranthi News హోమ్‌పేజ్‌ను సందర్శించండి.
ఇవి కూడా చదవండి:
తమిళనాడులో సంచలన ఫలితాలు.. విజయ్ TVK రికార్డు
బీజేపీ ఆఫర్‌కు టీవీకే నో! — 80 సీట్లు, డిప్యూటీ సీఎం పదవి ప్రతిపాదనను ఖండించిన విజయ్ పార్టీ
Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం
ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన
బెంగాల్ బీజేపీదే.! భవానీ పూర్‌లో ఆధిక్యంలో మమతా బెనర్జీ
బ్లాక్ బస్టర్ :తమిళ జన నాయకుడు విజయ్
చరిత్ర సృష్టించిన విజయ్.. దళపతి ప్రస్థానం ఇదే..!
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ అప్‌డేట్స్






