31 March, 2026 | 3:35 AM

సమ ఉజ్జీల సమరం

31-03-2026 12:58 AM
  1. నేడు పంజాబ్‌తో గుజరాత్ ఫైట్

గిల్ సత్తాకు పరీక్ష

శ్రేయాస్‌పైనే పంజాబ్ ఆశలు

న్యూ ఛంఢీఘడ్, మార్చి 30 : ఐపీఎల్ 19వ సీజన్‌లో మంగళవారం ఆసక్తికర పో రు జరగబోతోంది. శుభమన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్, గత ఏడాది రన్నర ప్‌గా నిలిచిన పంజాబ్ కింగ్స్‌ను ఢీకొంటోం ది. బలాబలాల పరంగా ఇరు జట్లు సమానంగా కనిపిస్తున్న వేళ సమఉజ్జీల సమరం గా చెబుతున్నారు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన గుజరాత్ తొలి సీజన్‌లోనే దు మ్మురేపింది.

అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఏ కంగా ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత సీజన్‌లోనూ రన్నరప్‌గా నిలిచింది. అయితే హార్థిక్ పాండ్యా ముంబైకి వెళ్లిపోవడంతో శుభమన్ గిల్‌కు సారథ్య బాధ్యతలు దక్కా యి. గత సీజన్‌లో ఎలిమినేటర్ కే పరిమితమైన గుజరాత్ ఈ సారి టైటిల్‌పై గురి పెట్టిం ది. మినీవేలానికి ముందు జట్టులో ఎక్కువ మార్పులు చేయలేదు.వేలంలో ఆల్ రౌండర్ హోల్డర్‌తో పాటు టామ్ బాంటన్, ల్యూక్ వుడ్‌లను తీసుకుంది.

కెప్టెన్‌గానే కాకుండా టీ20 ఫార్మాట్‌లో తన సత్తా నిరూపించుకునేందుకు గిల్‌కు ఈ సీజన్ మంచి అవకాశం. ఎందుకంటే పొట్టి క్రికెట్‌కు తగినట్టు ఆడలేకపోతున్నాడన్న కారణంతోనే టీ20 ప్రపంచ కప్ జట్టులో గిల్‌ను పక్కన పెట్టారు. భవిష్యత్తులో టీమిండియా టీ20 కెప్టెన్సీ కూడా అందుకుంటాడని అంచనాలున్న గిల్‌కు ప్ర స్తుత సీజన్ పరీక్షగానే చెప్పాలి.

కాగా గుజరాత్‌కు గిల్, సాయి సుదర్శన్ ఓపెనింగ్ కాం బినేషన్ అతిపెద్ద బలం. వీరి జోడీ గత సీజన్‌లో దుమ్మురేపింది. సాయి సుదర్శన్ 2025 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ సాధించగా.. గిల్ , బట్లర్ కూడా పరుగుల వరద పారించారు. అయితే మిడిలార్డర్‌లో నిలకడలేమి టైటాన్స్‌కు మైనస్ పాయింట్. గ్లెన్ ఫిలిప్స్ , రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్ ఎంతవరకూ రాణిస్తారో చూడాలి.

అటు బౌ లింగ్ మాత్రం హోల్డర్ రాకతో పేస్ బలం పెరిగినట్టేనని చెప్పొచ్చు. సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ గత సీజన్‌లో రాణించారు. స్పిన్ విభాగంలో రషీద్ ఖాన్ మునుపటి ఫామ్ అందు కోవాల్సి ఉండగా.. సాయి కిషోర్‌పై అంచనాలున్నాయి. మరోవైపు గత సీజన్‌లో ఫైనల్ వరకూ చేరి ట్రోఫీని ముద్దాడలేకపోయిన పంజాబ్ కింగ్స్ సీజన్‌ను విజయంతో ఆరంభించాలని భావిస్తోంది. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ పంజాబ్‌కు బలంగా చెప్పొచ్చు.

వేలంలో భారీ ధరకు దక్కించుకుని అతనికి పగ్గాలు అప్పగించింది. బ్యాటర్ గానే కా కుండా సారథిగానూ జట్టును బాగా నడిపించాడు. ప్రస్తుత సీజన్ లో పంజాబ్‌కు విదేశీ ఆల్ రౌండర్లే ప్రధాన బలంగా భావిస్తున్నా యి. స్టోయినిస్, యాన్సెన్, ఒమర్జాయ్, మిఛెల్ ఓవెన్,కూపర్ కానోలీ వంటి హిట్టర్లు కీలకం కానున్నారు. అలాగే స్వదేశీ బ్యాటర్లలో ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రి యాన్ష్ ఆర్యతో పాటు శ్రేయాస్‌పైనా అంచనాలున్నాయి.

బౌలింగ్‌లో అర్షదీప్ సింగ్ పంజాబ్ ప్రధాన అస్త్రం. అయితే అర్షదీప్ ఇటీవలి కాలంలో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. దీంతో ఐపీఎల్ 19వ సీజన్ అర్షదీప్ సత్తాకు పరీక్షగా చెప్చొచ్చు. స్పిన్ విభాగంలో యజ్వేంద్ర చాహల్‌పైనే పంజాబ్ ఆశలు పెట్టుకుంది.

గత రికార్డులు

ఐపీఎల్ చరిత్రలో పంజాబ్, గుజరాత్ ఆరు మ్యాచ్‌లలో తలపడగా చెరో మూడింటిలో విజయం సాధించాయి. గత సీజన్‌లో పంజాబ్ పైచేయి సాధించింది.

పిచ్ రిపోర్ట్

మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న న్యూ ఛండీఘడ్ బాలెన్సింగ్ గా ఉంటుందని అంచనా. ఇక్కడ సగటు స్కోరు 180 నుంచి 200 మధ్య నమోదవుతున్నాయి. మంచు ప్రభావంతో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవచ్చు.

తుది జట్లు అంచనా

గుజరాత్ టైటాన్స్ : శుభమన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, బట్లర్(కీపర్), గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, తెవాటియా, రషీద్ ఖాన్, సా యి కిషోర్, జాసన్ హోల్డర్, సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ

పంజాబ్ కింగ్స్ : ప్రభ్‌సిమ్రన్ సింగ్(కీపర్), ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కన్నోలీ, శ్రే యాస్ అయ్యర్(కెప్టెన్), స్టోయినిస్, శశాంక్ సింగ్, ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, మార్కో యెన్సన్, అర్షదీప్ సింగ్, చాహల్