31 March, 2026 | 2:41 AM

పీఎస్‌ఎల్‌లో బాల్ ట్యాంపరింగ్

31-03-2026 12:55 AM
  1. అడ్డంగా దొరికిన ఫఖర్ జమాన్

విచారణ చేపట్టిన పాక్ బోర్డు

రుజువైతే మ్యాచ్ నిషేధం

లాహోర్, మార్చి 30 : పాకిస్థాన్ సూపర్ లీగ్ రోజుకో వివాదంతో అభాసుపాలవుతోంది. తాజాగా బాల్ టాంపిరింగ్ వివాదం లీగ్‌ను కుదిపేస్తోంది. కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ జట్టు బా ల్ ట్యాంపరింగ్‌కు పాల్పడింది. దీన్ని గుర్తించిన అంపైర్లు ఐదు పరుగుల పెనాల్టీని విధిం చారు. ట్యాంపరింగ్‌కు సంబంధించిన వీడి యో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యా టింగ్‌కు దిగిన లాహోర్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 128 పరుగులు చేసింది. తర్వాత ఛేజిం గ్‌లో కరాచీ కింగ్స్ కూడా తడబడుతూ పో రాడింది.

చివరి ఓవర్లో విజయం కోసం 14 పరుగులు చేయాల్సి ఉండగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరి ఓవర్‌ను వేసేందుకు హ్యారీస్ రవూఫ్ సిద్ధమవుతుండగా.. లాహోర్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది అతనికి కొన్ని సలహాలు ఇస్తున్నాడు. అదే సమయంలో రవూఫ్ చేతిలో నుంచి బాల్ తీసుకున్న మరో సీనియర్ ప్లేయర్ ఫఖర్ జమాన్ దానిని గోళ్ళతో గీకాడు. వీడియోలో ఇది స్పష్టంగా కనిపించింది.

పక్కనే ఉన్న అంపైర్లు దీనిని గమనించి బంతిని పరిశీలించారు. ఇద్దరు ఫీల్డ్ అంపైర్లు చర్చించి బాల్ ట్యాంపరింగ్ జరిగిందని నిర్థారించా రు. వెంటనే ప్రత్యర్థి కరాచీ జట్టుకు ఐదు పరుగులు అదనంగా ఇచ్చారు.  దీంతో టార్గెట్ 6 బంతుల్లో 9 పరుగులుగా మారిం ది. తర్వాత కరాచీ కింగ్స్ 3 బంతుల్లోనే దాని ని అందుకుని మ్యాచ్ గెలిచింది. మ్యాచ్ ము గిసిన తర్వాత అంపైర్లు రిఫరీకి దీనిపై ఫిర్యా దు చేశారు.

అటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా  ఈ బాల్ ట్యాంపరింగ్ వివాదాన్ని సీ రియస్‌గా తీసుకుంది. ట్యాంపరింగ్ చేసినట్టు వచ్చిన ఆరోపణలను ఫఖర్ జమాన్ ఖండించాడని తెలిపింది. ఇదిలా ఉంటే 48 గంటల్లో ఈ వివాదంపై పీసీబీ విచారణ జరిపి చర్యలు తీసుకోనుంది. బాల్ ట్యాంపరింగ్ జరిగినట్టు రుజువైతే ఫఖర్ జమాన్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు.