calender_icon.png 22 July, 2025 | 3:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల నోళ్లపై చక్కని షాయరీ దక్కనీ

21-07-2025 12:00:00 AM

ఇత్తెఫాక్ భీ బడీ ఆస్కర్ చీజ్ హై సాహెబ్, హమీషా యాకీన్ సే నహీ, కభీ కభీ ఖ్వాబ్ భీ సచే హోతే హై !’

(యాదృచ్ఛికంగా అనుకోకుండా జరిగేదే గొప్పది సాబ్, ప్రతీసారి నమ్మకం నుంచే కాదు.. ఎప్పుడో ఓసారి కలలు కూడా నిజమవుతాయి!)

 కవి: అమీన అంఖర్షరీ 

“ప్యార్ మే మజా తబీ హై, జబ్ ఒకతర్ ఫోన్ బిజీ హో ఔర్ దూస్రా డయల్ కర్తే రహే.”

(మనం కాల్ చేసినప్పుడు బిజీ వస్తున్న సమయంలో అవతలి వ్యక్తి కూడా మనకే మళ్లీ మళ్లీ డయల్ చేస్తుండటమే ప్రేమలో నిజమైన మజా)

కవి: మునావ్వర్ అలీ

‘హమ్ హైదరాబాద్ వాలే హై? జో బీ కర్తే హై బిందాస్ కర్తే హై, చాహే దోస్తీ హో యా దుష్మనీ, ఖుల్కే కర్తే హై!’

(మేం హైదరాబాద్ వాళ్లం... ఏది చేసినా మనస్ఫూర్తిగా చేస్తాం.. అది స్నేహమైనా, శత్రుత్వమైనా.. బరాబర్ మనసుతోనే) 

కవి: బషీర్‌ద్దీన్ ఫారూక్ 

.. ఇలా దక్కనీ షాయరీలు దేశంలో నిత్యం ఏదో ఒక చోట ప్రతిధ్వనిస్తూనే ఉం టాయి. సాహిత్యాభిలాషులను మెప్పిస్తూనే ఉంటాయి. దక్కనీ కవులు ఉత్తరాది వెళ్లి షాయరీలు ఆలపిస్తుంటే, అక్కడివారు మంత్ర ముగ్ధులయ్యేవారు. హిందీ, ఉర్దూ సొబగులు ఉంటూనే, ఆ షాయరీల్లో దక్కనీ పలుకులు వారిని మెప్పించేవి. షాయరీ సాహిత్య పరిమళాలు వెదజల్లుతూనే కటువుగా, మోటుగా ఉండటాన్ని చూసి ఆశ్చర్య పోయేవారు.

కాలక్రమేణా సాహిత్యరంగం నుంచి కనుమరుగైన దక్కనీ హైదరాబాదీల నోళ్లపైన నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. నగర లోకల్ భాషగా, మనుషుల మధ్య ఉన్న స్నేహానుబంధాల్లో సాగుతూనే ఉం టుంది. దక్కనీ భాషకు 600 ఏళ్ల చరిత్ర ఉం ది. బహమనీ సామ్రాజ్యం కాలంలో డక్కనీ ప్రత్యేక భాషగా ఉండేది. 17, 18వ శతాబ్దా లు దక్కనీకి స్వర్ణయుగం. ఇది పర్షియన్, ఉత్తరాది భారతీయ భాషల సమ్మేళనం.

తెలుగు, కన్నడ, మరాఠీ భాషలు సమ్మిళిత మై చక్కటి భాషగా ఏర్పడిన మాండలికం. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల కేంద్రంగా దక్కన్ పీఠభూమి పరిసరాల్లో వెలుగొందింది. మరాఠీ, కన్నడ, తెలుగు పదాలను తనలో కలుపుకొంటూ ఎదిగింది. భాషాపరమైన ఈ భిన్నత్వమే దక్కనీ మాం డలికానికి ప్రత్యేకతను తీసుకువచ్చింది. ఇం తకీ దక్కనీ భాషను ఎలా నిర్వచించాలంటే.. దక్కన్ పీఠభూమితో పాటు పరిసర ప్రాం తాల్లో మాట్లాడే భాష దక్కనీ..

లిపి మాత్రం ఉర్దూ అక్షరాల్లోనే. కర్ణాటక ప్రాంతంలో దక్కనీ మాట్లాడేవారు దీనిని ‘కర్నాటకి’ అని ముద్దుగా పిలుచుకుంటారు. భాగ్యనగర నిర్మాత మహమ్మద్ కులీ కుతుబ్‌షా స్వయంగా దక్కనీలో కవిత్వం రాశాడు. వాలి మహ్మద్ వాలి ఉత్తరాదిలో దక్కనీ భాషలో షాయరీలు అల్లాడు. దక్కనీకి‘గజల్’ సొబగులు తొడిగాడు.

ఇప్పటికీ దక్కనీ సాహిత్యా న్ని ఇష్టపడే కొందరు ‘దిల్ జీ చైన్ సే ఖయా ల్ హై.. హౌలే హౌలే గుఫ్తగూ కరో’ అనే షాయరీని పాడుతుంటారు. అలాగే ఫిరోజ్ షా, బురానుద్దీన్ జనమ్, ఖురేషీ బిద్రీ, గవాసీ, వాజాహీ, కులీ కుతుబ్ షా వంటి ఎందరో కవులు దక్కనీలో చిక్కనైన షాయరీలు రాశారు. 

హవ్.. నక్కో.. కన్ఫ్యూషన్..

హైదరాబాద్‌లో హిందీ మాట్లాడుతు న్నాం.. అనుకునేవారు ఎక్కువ మంది ‘అవు ను’ అనే పదం వాడాల్సి వచ్చినప్పుడు ‘హవ్’ అంటారు. నిజానికి అందుకు ఉపయోగించాల్సిన అసలైన హిందీ ‘హా’. ఆ అక్షరానికి ప్రత్యామ్నాయంగా ‘హవ్’ దక్కనీలో కలిసిపోయిందన్నమాట. అలాగే వద్దు అనడానికి ఇక్కడ ‘నక్కో’ అని అనే స్తాం.

నిజానికి వద్దు అనడానికి హిందీలో ‘నా’ లేదు.. ‘నహీ’ అని వాడాలి. కానీ.. దక్కనీ ప్రాంతం లో ‘నక్కో’ అని వాడతాం. ‘హవ్?’, ‘నక్కో’ మాత్రమే కాదు.. ఇక్కడ పొద్దున లేచిన దగ్గర్నుంచి బాటాన్, మత్తిమిలా, ఉజాద్ సూర త్, హౌలే, దలిందర్, మట్టి పఱ్ఱో.. ఇలాంటి ఎన్నో పదాలు నిత్యం హైదరాబాద్‌లో వింటూ వుంటాం.

సున్తానై షాయరీలు ఫేమస్..

దక్కనీ భాషలో కొందరు షాయరీ పా డుతుంటే హాలు హాలు మొత్తం చప్పట్ల తో.. నవ్వులతో గొళ్లుమనేది. ఉదాహరణకు వద్దంటే ‘వినదు/ వినరు’ అనే మకు టంతో వచ్చే దక్కనీ షాయరీ ఎంతో ఫేమస్. 

కర్నే కొ జో కామా హైసా

జైసేకే వైసే హీ హై

నై కర్నేకే కామా కర్ రై

నై బోలేతే సున్తేనై

(చేయాల్సిన పనులన్నీ ఎక్కడివక్కడే ఉన్నయ్ చేయకూడని పనులు చేస్తున్నవ్ వద్దంటే వినవు)

ఉమర్ కే పీఛే మత్ భాగో

గయేసీ జవానీ ఆతీనై

మేకప్ గీకప్ నక్కో

నైబోలేతో సున్తే నై

(వయసు వెనుక పరుగెత్తొద్దు పోయిన వయసు రాదు మేకప్ గీకప్ వద్దు వద్దంటే వినవు)

అచ్ఛే అచ్ఛే డ్రామే దేఖో

కిత్తా కిత్తా సమ్ ఝాయా

గంధే ఫిల్మే మత్ దేఖో

నై బోలేతో సున్తేనై

(మంచి మంచి నాటకాలు చూడు ఎంత బాగా చెప్పా ఆ పాడు సినిమాలు చూడొద్దని వద్దంటే వినవు

 ... ఇలా సాగేవి ఆ ఫన్నీ షాయరీలు. ఇప్పటికీ నగరంలో కొందరీ షాయరీలను గుర్తుతెచ్చుకుంటూ ఎంజాయ్ చేస్తారు. 

ప్రేమ, విరహంపై దక్కనీలో కవితలు రాసిన వారిలో కులీ కుతుబ్ షా ఎంతో ప్రసిద్ధి చెందారు. 

పియా బాజ్‌ప్యాలా 

పియాన జానెన

పియా బాజ్

పియా బాజ్ ఎక్ తిల్ జియా న జానెన

(ప్రేయసి లేకుండా పాత్రలో మధువు తాగలేను... ప్రేయసి లేకుండా కనీసం శ్వాసైనా తీసుకోలేను)

యూట్యూబ్‌లోనూ ఇప్పుడు దక్కనీ షాయరీలు ఫేమస్. ఎందరో స్టాండప్ కమేడియన్స్ ఇప్పుడు దక్కనీ భాషలో ప్రాచుర్యం పొందిన షాయరీలు, ముషాయిరీలను వాడి నవ్వులు పూయిస్తున్నారు. ఇంతగా జనాల్లో నానుకుపోయిన దక్కనీని ఎలా కాపాడుకోవాలని ఎవరైనా అడిగితే.. ‘ఓల్డ్ సిటీ అత్తరు, బిర్యా నీ, చార్మినార్, గోల్కొండ లాగే దక్కనీ భాష కూడా హైదరాబాదీల నోళ్లపై వెయ్యేళ్లు వర్ధిల్లుతుందని ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి పెద్దలు.

సినీ తారల మురిపెం

అది.. ‘దృశ్యం’ మూవీ ప్రమోషన్. నటుడు అజయ్ దేవగణ్, నటీమణులు శ్రియా, టబు, తదితరులు అక్కడే ఉన్నా రు. కార్యక్రమానికి హోస్ట్ ఇప్పటి టాలీవుడ్ స్టార్ నవీన్ పొలిశెట్టి. ప్రమోషన్‌లో భాగంగా హోస్ట్ నవీన్ సాధారణంగా అజయ్, శ్రియా, టబుతో మాటలు కలుపుతాడు. ఈ క్రమంలో టబును చూసి స్టన్ అవుతున్నట్లు అభినయిస్తూ.. ‘వైసా నక్కొ దేఖో యారో’ అంటూ ఫ్లర్టింగ్ చేశా డు.

టబు నవ్వాపుకొంటుండగా.. మళ్లీ అందుకుంటూ నవీన్ ‘వైసా మేరే ఆఖో మే దేఖోనా యారో.. ఇదర్ ఉదర్ కైకూ దేఖ్‌రే.. దిల్ గబ్ గబ్ హోరా..’ అంటూ దక్కనీ యాసలో చెలరేగిపోయాడు. ఆ మాటలు విన్న టబు కడుపు చక్కలయ్యే లా నవ్వారు. ఇంతకీ.. టబు ఆ సన్నివేశానికి ఎందుకు కనెక్ట్ అయిందంటే.. తను పక్కా హైదరాబాదీ ! నటిగా ఏళ్ల నుంచి బాలీవుడ్‌లో స్థిరపడిన టబు ఒక్కసారి మళ్లీ హైదరాబాదీ దక్కనీ విని మురిసి ముక్కలయ్యారు.

అలాగే వెంకటేశ్ కథానాయకుడిగా గతేడాది విడుదలైన ‘సైంధవ్’ చిత్రంలో ప్రతినాయకుడిగా బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించారు. ఆ చిత్రంలో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకొన్నారు. దక్కనీ ఉర్దూ మాట్లాడి నవ్వులు పూయించారు. కథలో తన వద్ద పనిచేస్తున్న లేడీ అసిస్టెంట్‌ను ప్రేమిస్తుంటాడు నవాజ్.

ఆ విషయాన్ని తనకు చెప్పాలని తహ తహలాడుతుంటాడు. ‘మైనే కైకూ ఉస్కో బోల్ నై పారై.. మేరేకో డర్ లగ్రే హే మియా..’ అంటూ దక్కనీలో పక్కనే ఉన్న చోటా గ్యాంగ్‌తో వాపోతాడు. హైదరాబాద్‌తో అనుబంధం ఉన్న వారికి, ఈ నగరాన్ని ఇష్టపడేవారికి, దక్కనీ సాహిత్య పరిమళాలు తెలిసిన వారికి ఇదంతా ఓ మురిపెం.